‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్‌ లుక్‌ | Ram Hello Guru Prema Kosame Movie First Look Will Released | Sakshi
Sakshi News home page

Published Mon, May 14 2018 10:11 AM | Last Updated on Mon, May 14 2018 10:59 AM

Ram Hello Guru Prema Kosame Movie First Look Will Released - Sakshi

‘ఉన్నది ఒకటే జిందగీ’తో సక్సెస్‌ సాధించారు రామ్‌. సినిమా చూపిస్త మామ, నేను లోకల్‌ వంటి హిట్‌ మూవీస్‌ తీశారు డైరెక్టర్‌ త్రినాథ్‌రావు నక్కిన. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో మరో లవ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ తెరకెక్కుతోంది. ఒకప్పటి హిట్‌ సాంగ్‌ హలో గురు ప్రేమ కోసమోరా జీవితం...అంటూ సాగే ఆ పాటనే సినిమా టైటిల్‌గా ఎంచుకున్నారు. 

త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్‌ లుక్‌ను ఈరో​జు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement