Allu Arjun Pushpa First Single Song Daakko Daakko Meka All Time Records In Youtube - Sakshi
Sakshi News home page

pushpa Movie: దాక్కో దాక్కో మేక.. మొదలైంది రికార్డుల మోత

Published Fri, Aug 13 2021 4:38 PM | Last Updated on Fri, Aug 13 2021 5:35 PM

Allu Arjun Pushpa First Song Daakko Daakko Meka Records In Youtube - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శుక్రవారం ఈ మూవీ నుంచి తొలి పాట ‘దాక్కో దాక్కో మేక..’ విడుదలైంది.   ఈ సాంగ్‌ని హిందీలో విశాల్ ద‌డ్‌లాని, క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,త‌మిళంలో బెన్నీ ద‌యాల్  ఆల‌పించారు.

అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌, దేవీశ్రీ స్పెషల్‌ బీట్‌, చంద్రబోస్‌ పవర్‌ ఫుల్‌ లిరిక్స్‌ కలిస్తే.. ‘దాక్కో దాక్కో మేక’పాట.  ఈ ప్రపంచంలో ప్రతి జీవి బతకడం కోసం మరో జీవిని చంపక తప్పదు అనే అర్థం చెప్పేలా అద్భుత లిరిక్స్‌ అందించాడు చంద్రబోస్‌. ఈ సాంగ్‌ అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలైన 182 నిమిషాల్లోనే 4 లక్షల లైకులను సొంతం చేసుకొని రికార్డు క్రియేట్‌ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు 39లక్షలకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. ఈ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement