ఈరోజుల్లో అధిక బరువు సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. చాలా రోగాలకు అధిక బరువు కూడా కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు అనేక మంది నానా యాతన పడుతుంటారు. బరువు తగ్గడం అనేది అంత ఆశామాషీ కాదు. ఇందు కోసం చాలా కష్టపడాలి. సరైన డైట్ ఫాలో అవ్వాలి.
బరువు తగ్గాలని అనుకోగానే చాలా మంది డైటీషియన్లను, న్యూట్రిషనిస్టులను సంప్రదిస్తుంటారు. కానీ బరువు తగ్గడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగించడం గురించి విన్నారా? అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాగే చేశాడు.
గ్రెగ్ ముస్కెన్ అనే వ్యక్తి చాట్ జీపీటీ అందించిన డైట్ ప్లాన్‌ను అనుసరించి ఏకంగా 11 కేజీలు బరువు తగ్గాడు. నివేదికల ప్రకారం.. అధిక బరువున్న గ్రెగ్‌కు రన్నింగ్ చేయడం ఇష్టం లేదు. దీంతో చాట్ జీపీటీ సహాయంతో హెల్తీ డైట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.
ఇదీ చదవండి ➤లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి..
మూడు నెలల తర్వాత ఆశ్చర్యకరంగా వారానికి ఆరు రోజులు రన్నింగ్ చేయగలుగుతున్నాడు. మరిన్ని వర్కవుట్‌లపై గ్రెగ్‌కి ఆసక్తి పెరిగింది. తన బరువును చూసుకోగా అప్పటికే 11 కేజీలు తగ్గాడు. చాట్ జీపీటీ ఇచ్చిన డైట్ ప్లాన్‌ను గ్రెగ్ మొదట్లో నమ్మలేదు. కానీ ఆ ప్లాన్ సరళంగా, సులభంగా ఉంటడంతో అనుసరించడం ప్రారంభించాడు.
చిన్న అలవాటే..
రన్నింగ్ షూస్‌ను ఫ్రంట్ డోర్‌కి దగ్గరగా పెట్టుకోవడం వంటి చిన్నచిన్న సలహాలను చాట్ జీపీటీ ఇచ్చింది. మూడో రోజు నుంచి గ్రెగ్ కొన్నినిమిషాలపాటు కొద్దిపాటి దూరం నడవడం ప్రారంభించాడు. నిజానికి ఇది సరైన విధానమని నిపుణులు కూడా ధ్రువీకరించారు.
కొత్తగా వర్కవుట్‌లు మొదలు పెట్టేవారు కష్టమైన వర్కవుట్‌ల జోలికి వెళ్లడం మంచిది కాదని, గాయాల బారిన పడకుండా ఉండాలంటే మొదటి చిన్నగా ప్రారంభించి రోజురోజుకు పెంచుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. చిన్నపాటి అలవాట్లే వర్కవుట్ గాడిలో పడేలా చేస్తాయని చెబుతున్నారు.
ఒకే రకమైన డైట్ ప్లాన్ సరికాదు
చివరగా చెప్పేందేంటంటే ఒక్కొక్కరి శరీర స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన డైట్ ప్లాన్‌లు సరిపడవు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment