సాక్షి,హైదరాబాద్: తెలుగు యూట్యూబర్ హర్ష మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. గురువారం కూకట్ పల్లిలో రద్దీగా ఉండే ప్రాంతంలో డబ్బును గాల్లోకి విసిరి రీల్స్ చేశాడు. నోట్లు వెదజల్లడంతో వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాల్లోకి నోట్లు విసురుతున్న రీల్స్ వైరల్ కావడంపై ప్రజలు, నెటిజన్లు సదరు యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా యూట్యూబర్ హర్ష ఇప్పటికే పలు మార్లు డబ్బుల్ని గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టంట్లు చేయడం,విసిరిన డబ్బుల్ని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించడంపై వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో మరోసారి డబ్బుల్ని గాల్లోకి విసరడంతో ట్రాఫిక్‌జామ్ కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి పోలీసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in Hyderabad
Cyberabad police will you please take action?
A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024
Comments
Please login to add a commentAdd a comment