లక్నో: తన భార్య తీసిన సెల్ఫీ ఫొటో ఓ పోలీసు అధికారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో, సదరు పోలీసు అధికారి బదిలీ కావాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సెల్ఫీ ఫొటోలో ఏం ఉందనుకుంటున్నారా?. అక్షరాల 14 లక్షల రూపాయల నోట్ల కట్టలు. కాగా, కరెన్సీ నోట్లతో దిగిన సెల్ఫీ వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సహాని ఎస్‌ఐగా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల సహాని భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక, సెల్ఫీ ఫొటో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. సహానిపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సహానిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు.
అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఫొటోలో 14 లక్షల రూపాయల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన సహానీ భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ఇక, ఈ ఫొటోపై ఎస్‌ఐ సహాని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పుకొచ్చాడు.
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రమేష్ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నాము. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ చేయబడ్డారు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత ఆ పెద్దాయనకి షాక్
Comments
Please login to add a commentAdd a comment