ఇప్పటి వరకు పలు సందర్భాల్లో పురుషులే రాత్రి సమయాల్లో లిక్కర్ షాపులను షటర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడిన ఘటనలు చాలానే చూశాము. కానీ, ఇక్కడి ఓ మహిళ లిక్కర్ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. లిక్కర్ కోసం ఏకంగా వైన్ షాపునే టార్గెట్ చేసిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. పెద్ద రాడుతో లిక్కర్ షాపు వద్దకు వచ్చిన సదరు మహిళ.. తాళం పగులగొట్టేందుకు శ్రమించింది.
షాపు తాళం ఎంతకు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం సౌండ్ విని అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా షాపు బయట ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
उन्नाव में लड़कियों के हौसले बुलंद : CCTV कैमरे में कैद हुई घटना, लड़कियों ने ज्वेलरी शॉप का ताला तोड़ा वीडिओ हुआ वायरल....#viralvideo #SocialMedia #Unnao #ViralVideos #Viral #UPPolice @unnaopolice pic.twitter.com/vsEUDPEh0E
— Nedrick News (@nedricknews) December 3, 2022
Comments
Please login to add a commentAdd a comment