యూట్యూబర్ అరెస్టు
తిరువొత్తియూరు: మహిళలపై అనుచిత వీడియో లను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన యూ ట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌కు చెందిన దుర్గైరాజ్ యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. దీని ద్వారా చాలా మంది మహిళలతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యేవాడు.
అందుకు తగ్గట్టుగానే పుదుచ్చేరికి చెందిన ఓ మహిళతో మాట్లాడే వారు. తరువాత ఆమెతో భేదాభిప్రాయాలు వ చ్చాయి. ఆ తర్వాత మహిళను అసభ్యకరంగా చిత్రీకరించిన ఆడియో, వీడియోలను తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనిపై ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దుర్గైరాజ్‌పై కేసు నమోదు చేశారు. విచారణలో దుర్గైరాజ్ యూ ట్యూబ్ ఛానెల్‌ని పరిశీలించగా, అతను 20 మందికి పైగా మహిళలను అసభ్య పదజాలంతో దూషించి, మహిళలను కించపరిచేలా వీడియో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు.
అలాగే వీడియో రికార్డింగ్ చేసిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రాన్ని కూడా అసభ్య పదజాలంతో దూషించాడని, వీలైతే పోలీసులను ఉపయోగించి అరెస్టు చేయమని సవాల్ విసిరినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పోలీసులు మదురైలో తలదాచుకున్న దుర్గైరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment