ప్రముఖ యూట్యూబర్ అరుణ్ మైని తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్ద్రిషను పెళ్లాడాడు. ఈశుభవార్తను సోషల్ మీడియాద్వారా పంచుకున్నాడు.ఈ వివాహానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ ఫోటోలను షేర్ చేశాడు.
"8 జూన్ 2024 నేను నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రేరణ, నా దేవత, నా సర్వస్వాన్ని పెళ్లి చేసుకున్నాను. మా జీవితాల్లోని ఆ మూడు రోజుల ఆనంద క్షణాలను హాయిగా గడిపాం. సంపూర్ణంగా ఎంజాయ్ చేశాం. ఇక భవిష్యత్లుగా జంటగా జీవించే లైఫ్ గురించి ఉత్సాహంగా ఉన్నాం’ అంటూ తమ పెళ్లి కబురు గురించి ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఎక్స్‌లో అరుణ్ చేసిన పోస్ట్‌కు సుమారు 30 లక్షల లైక్స్ వచ్చాయంటేనే అతని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో రాయల్ లుక్‌లో ఈ లవ్‌బర్డ్స్ అరుణ్, ద్రిష అందంగా మెరిసిపోయారు.
‘మిస్టర్ హూఈజ్ ది బాస్’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా అరుణ్ మైనీ ఆధునిక టెక్ కంటెంట్, డిజిటల్ టెక్నాలజీ ఇలా అనేక విషయాల గురించి తన ఛానల్‌లో మాట్లాడుతాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌లో1. 8 కోట్ల సబ్‌స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టాగ్రాంలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.
I just married my best friend pic.twitter.com/lW2oICMV1I
— Arun Maini (@Mrwhosetheboss) June 11, 2024
అరుణ్ దంతపు రంగు షేర్వానీని , తలపాగా ,దుపట్టాలో కొత్త పెళ్లికొడుకుగా మారిపోయాడు. ఇక ధృషా అయితే భారీగా ఎంబ్రాయిడరీ చేసిన రెడ్ రంగు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. ఆకుపచ్చ రత్నాలతో బంగారు చోకర్, ఆకుపచ్చ రత్నంతో రాయితో పొదిగిన చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment