2025 జనవరి 11 నుంచి రిలయన్స్ జియో తన ఎయిర్ ఫైబర్ & ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో.. యూట్యూబ్ మధ్య ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది.
యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు
➤అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా.. ఇష్టమైన వీడియోలను ఎలాంటి అడ్డంకులు చూడవచ్చు.
➤ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా (ఆఫ్‌లైన్) ఎప్పుడైనా కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➤ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియోలు చూడవచ్చు.. మ్యూజిక్ కూడా వినవచ్చు.
➤యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్ కింద 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల ఫ్రీ లైబ్రరీ వంటి వాటిని పొందవచ్చు.
ప్లాన్ వివరాలు
రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంది సంస్థ అందించే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అవకాశం జియో ఎయిర్ ఫైబర్ & జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడం ఎలా
➤ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత, మై జియో యాప్‌లో మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వండి.
➤ఆ పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.
➤మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయండి.
➤అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వండి, యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించండి.
Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.
Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP— Reliance Jio (@reliancejio) January 11, 2025
Comments
Please login to add a commentAdd a comment