యూట్యూబ్ కొన్నేళ్లుగా ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఏ సమాచారం కావాలన్నా, ఏం సందేహం వచ్చినా అన్నింటికీ అదే సమాధానం అయిపోయింది. ఒకప్పుడు వీడియోలు చూడటానికే పరిమితమైన యూజర్లు క్రమంగా తామూ వీడియాలు చేస్తూ తమను తాము ప్రదర్శించుకోవడానికి యూట్యూబ్‌ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారు.
యూట్యూబ్‌లో ఏదైనా కంటెంట్‌ను అభిమానిస్తూ ఫాలో అయ్యే ఫ్యాన్స్ ధోరణిలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఏడాది కాలంగా భారతీయ యూజర్లలో వచ్చిన మార్పులపై యూట్యూబ్ ఓ నివేదికను విడుదల చేసింది. యూట్యూబ్ కల్చర్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ జెన్ జెడ్ (14-24 సంవత్సరాల వయసువారు)లో 91% మంది గత సంవత్సరంలో ఫ్యాన్ సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. 93% మంది తమకు ఇష్టమైన అంశాలను అనుసరించడానికి వారానికోసారైనా యూట్యూబ్‌ను ఉపయోగించారు.
ముంబైలో జరిగిన యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్మిత్‌గీగర్‌తో కలిసి రూపొందించిన ఈ నివేదికను యూట్యూబ్ విడుదల చేసింది. ఇంకా ఈ రిపోర్ట్ మరికొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భారతీయ జెన్ జెడ్‌లో 83% మంది తమను తాము క్రియేటర్లుగా ప్రదర్శించుకున్నారు. 87% మంది వివిధ స్థాయిలలో ఎవరో ఒకరికి, ఏదో ఒక దానికి ఫ్యాన్‌గా నిమగ్నమయ్యారు. అంటే లైక్, కామెంట్ వంటివి చేశారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment