మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.
కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్‌లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.
(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)
ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు.
ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment