Murder Movie
-
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024 -
M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీ టీజర్‌ను దిల్ రాజు లాంచ్ చేశారు
-
ఆ సీన్లు చేసేటప్పుడు నైతికంగా చచ్చిపోయా: నటి
ముంబై: బాలీవుడ్ సినిమా ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందారు. ఈ రెండు చిత్రాల్లోనూ మితిమీరిన గ్లామరస్ షో చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇంతకు దిగజారావా అనే కామెంట్లు కూడా ఆమె చెవిన పడ్డాయి. ఈ విషయాల గురించి తాజాగా బాంబే టైమ్స్‌తో మాట్లాడిన మల్లికా శెరావత్ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘‘మర్డర్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నైతికంగా నేను చచ్చిపోయినట్లు అనిపించింది. దిగజారుడు మనస్తత్వం గల మహిళగా చిత్రీకరించే సన్నివేశాల్లో హత్యకు గురైనట్లుగా భావించాను. అందుకు తగ్గట్లే విమర్శలు కూడా. అయితే, నేను అప్పట్లో చేసిన ఈ సీన్లు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణమైపోయాయి. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. చాలా మార్పులు వచ్చాయి. కానీ, నాకు మాత్రం 50, 60వ దశకాల నాటి సినిమాలే ఇష్టం. వాటిని ఎవరూ బీట్ చేయలేరు. అప్పట్లో స్త్రీల కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించేవారు. అయితే, రానురాను ఆ సున్నితత్వం, అందులోని అందం మసకబారిపోయింది. ఒక్క మంచి పాత్ర కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని మల్లిక తన మనసులోని భావాలు వెల్లడించారు. నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు ఇక తన సినిమాల విడుదలలో జాప్యం జరగడం గురించి చెబుతూ..‘‘సినిమాలతో పాటు వెబ్ షోస్ కూడా చేస్తున్నా. ట్రావెలింగ్‌ను ఆస్వాదిస్తున్నా. నిజానికి.. ఇలాంటి పాత్రలు కావాలి, ఇదే చేయాలి, ఇప్పుడు విడుదల కావాలి అని అడిగేందుకు, నాకు మద్దతుగా నిలిచేందుకు బాయ్‌ఫ్రెండ్ లేడు. నా బతుకు నేను బతుకుతున్నా. ప్రశాంతంగా ఉన్నా. సమయం వచ్చినపుడు అన్నీ అవే జరుగుతాయి. సినిమాల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తాను’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా మల్లికా శెరావత్ తాజాగా నటించిన ఆర్కే/ఆర్కేఏఓ చిత్రం అమెరికా, కెనడా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. రజత్, మల్లికతో పాటు రణ్వీర్ షోరే, కుబ్రా సైత్, మను రిషి చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: ప్రేమను పంచుతానంటోన్న నిధి అగర్వాల్ -
ఇది... జరిగిన 'మర్డర్' కథే!
చిత్రం: ‘మర్డర్... కుటుంబకథా చిత్రమ్’ తారాగణం: శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ ఆవంచ, గిరిధర్; సంగీతం: డి.ఎస్.ఆర్; కెమెరా: జగదీశ్ చీకటి; నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి; దర్శకత్వం: ఆనంద్ చంద్ర; రిలీజ్: డిసెంబర్ 24 వివాదాస్పద సంఘటనలను వెండితెర పైకి తెచ్చి, నిర్మాణం దశలోనే బోలెడంత ప్రచారం సంపాదించుకోవడం రామ్‌గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. మర్డర్... కుటుంబ కథా చిత్రం అందుకు మరో తాజా ఉదాహరణ. ఓ పరువు హత్య ఘటన ప్రేరణగా ఆయన తన బృందంతో చేయించిన సినిమా ఇది. కానీ, సినిమాలో ఉత్కంఠ రేపే రీరికార్డింగే కాక, కాస్తంతయినా విషయం కీలకమనేది మర్చిపోవడంతో కష్టం వచ్చిపడింది! కథేమిటంటే..: ‘పిల్లల్ని ముద్దు చేయాలి. కానీ అతి గారాబం చేస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. నాకు అది ఇప్పుడే తెలిసింది’ అంటూ తండ్రి పాత్ర వాయిస్ ఓవర్‌తో మొదలవుతుందీ సినిమా. చిన్నస్థాయి నుంచి కష్టపడి కోట్లకు పడగెత్తిన వ్యాపారి మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్). మాధవరావు, వనజ (గాయత్రీ భార్గవి) దంపతుల ఏకైక కుమార్తె – నమ్రత (సాహితీ ఆవంచ). కాలేజీలో చదువుతూ, స్నేహితులు, లేట్ నైట్ పార్టీలతో గడుపుతున్నా తల్లితండ్రులు గారం చేసే ఆ అమ్మాయి, తన కాలేజ్ మేట్ ప్రవీణ్‌తో ప్రేమలో పడుతుంది. వేరే కులం వారైన ప్రవీణ్, అతని కుటుంబం – కేవలం ఆస్తి కోసమే ఈ ప్రేమ నాటకం ఆడుతున్నాడంటాడు తండ్రి. తల్లితండ్రులు కాదన్నా, ఎదిరించి ప్రవీణ్‌ను పెళ్ళాడి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూతురు. ముద్దుల కూతుర్ని ఎలాగైనా మళ్ళీ ఇంటికి రప్పించాలనే ఉద్దేశంతో మానవత్వం మరిచిన ఆ తండ్రి ఏం చేశాడు, చివరకు ఏం జరిగిందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: మూస ధోరణికి భిన్నంగా విచిత్రమైన కెమేరా యాంగిల్స్, కథలోనూ – సన్నివేశంలోనూ లేని ఉత్కంఠను కలిగించే నేపథ్య సంగీతంతో వచ్చిన రామ్‌గోపాల్ వర్మ మార్కు సినిమా – ‘మర్డర్’. తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రేమించడం తప్పా అని ప్రశ్నించే ఈ 113 నిమిషాల సినిమాలో తండ్రి పాత్ర కీలకం. కన్నకూతురును అతిగా ప్రేమించే ఆ తండ్రి పాత్రలో డాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ క్లైమాక్స్ లాంటి కొన్నిచోట్ల జీవించారు. ఒకటీ అరా చోట్ల అతిగానూ అనిపించారు. తల్లి పాత్రలో యాంకర్ గాయత్రీ భార్గవికి చాలాకాలం తరువాత మంచి స్క్రీన్ స్పేస్ దక్కింది. కూతురిగా నటించిన సాహితీ ఆవంచకు ఇది తొలి చిత్రం. ఈ నూతన నటి బాగానే ఉన్నా, తనను అమితంగా ప్రేమించిన తల్లితండ్రులను ఆమె అంతగా ద్వేషించడానికి తగిన కారణాలను కథలో బలంగా చెప్పలేకపోయారు. ఫలితంగా కూతురి పాత్ర క్యారెక్టరైజేషన్ దెబ్బతింది. ఇక, సినిమాలోని మిగతా పాత్రలన్నీ కథానుసారం వచ్చి వెళుతుంటాయి. పెద్ద కథ లేదు... పేరున్న నటీనటులూ లేరు... లొకేషన్ ఛేంజ్‌లు లేవు... పాటలు లేవు... డ్యాన్సులు లేవు... కామెడీ లేదు... అయినా కదలకుండా కూర్చోబెట్టడానికి వర్మ బృందం శ్రమించింది. పూర్తిగా కాకపోయినా కొంతమేర సక్సెస్ అయింది. ఆ మేరకు ఇది రొటీన్ చిత్రాల వెల్లువలో ఓ విశేషమే. ఎలా తీశారంటే..: సమాజంలో నలుగురి దృష్టినీ ఆకర్షించేలా ఏ చిన్న నేరసంఘటన జరిగినా, దాని మీద వెంటనే ఓ సినిమా తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. ఈ సినిమా కూడా అచ్చంగా అంతే. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో ఆయన శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. కానీ, వర్మ టేకింగ్ ఛాయలు తెర నిండా పుష్కలంగా కనిపిస్తాయి. తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన అమృత – ప్రణయ్‌ల ప్రేమకథ, పిల్ల తండ్రి మారుతీరావు చేయించారంటూ వార్తలొచ్చిన పరువుహత్య లాంటి వార్తలన్నీ అందరికీ తెలిసినవే. ఆ తెలిసిన, జరిగిన కథనే ఎమోషనల్ గా చెప్పడానికి వర్మ బందం ప్రయత్నించింది. చాలావరకు సక్సెస్ అయింది. కాకపోతే, న్యాయపరమైన ఇబ్బందుల రీత్యా ఈ సినిమాకూ, ఆ జరిగిన కథకూ సంబంధం లేదంటూ వాదించింది. నిజజీవితంలోని పేర్లను వాడకుండా, వాటికి దగ్గరగా ఉండే పేర్లతో సినిమా తీసింది. దీనికి, అనేక నిజజీవిత సంఘటనలు ఆధారమంటూ చెప్పుకొచ్చింది. కోర్టు వివాదాల మధ్య సెన్సార్ చిక్కుల్లో పడి, చివరకు తొమ్మిది మంది సభ్యుల రివైజింగ్ కమిటీ (ఆర్.సి) దగ్గర సెన్సార్ సంపాదించుకొందీ చిత్రం. ఇద్దరు – ముగ్గురు పాత్రధారులు, ఒకే ఇంటిలో తిరిగే కెమేరాతో చాలా పరిమితమైన బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా మంచి బిజినెస్ వ్యూహమే. పైగా, ఆ పరిమితులేవీ తెలియనివ్వకుండా వీలైనంత జాగ్రత్తపడడానికి ప్రయత్నించడమూ ముచ్చటేస్తుంది. కానీ, ఒక దశలో కథ ముందుకు సాగక, అదే నాలుగు గోడల ఇంట్లో... అవే పాత్రలు, అదే రకమైన డైలాగులతో ప్రేక్షకులకు విసుగనిపిస్తుంది. అయితే, అంతటి ఆ విసుగులోనూ కూర్చొనేలా చేసే నేర్పు కూడా దర్శకుడి తీత చేసిన మాయాజాలం. అందుకు సహకరించిన కెమేరా, నేపథ్య సంగీత విభాగాలను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్న ప్రేమకథలన్నిటినీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో తెరపై చూపడం రీతి, రివాజు. కానీ, ఈ ‘మర్డర్’ కథను మాత్రం అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి దృష్టి కోణం నుంచే పూర్తిగా చూపడం కొత్తగా అనిపిస్తుంది. అందుకే, సినిమా చూశాక, ప్రేమికుల మీద కన్నా పెంచిన తల్లితండ్రుల మీదే కొంత ఎక్కువ సానుభూతి కలిగితే తప్పు పట్టలేం. వెరసి సమాజంలో జరిగే ఇలాంటి మర్డర్ లను సమర్థించలేం. తెరపై చూపిన ఈ కథను బాగుందని అనలేం. పూర్తిగా బాగా లేదనీ చెప్పలేం. (చదవండి: డర్టీ హరి మూవీ రివ్యూ) బలాలు: ∙నిజజీవిత ఘటనతో అల్లుకున్న కథ ►విలక్షణమైన కెమేరా యాంగిల్స్ ►ఉత్కంఠ రేపే నేపథ్య సంగీతం బలహీనతలు: ప్రత్యేకంగా పెద్ద కథంటూ ఏమీ లేకపోవడం ►పాత్రలు, సంఘటనలన్నీ అక్కడక్కడే తిరగడం ►పాత్రధారులు బాగున్నా... కొన్నిచోట్ల అతిగా మారిన నటన కొసమెరుపు: ఇదో అకల్పిత కథ. తల్లితండ్రుల కోణంలో మర్డర్‌ను సమర్థించే కథనం. – రెంటాల జయదేవ -
అమృతకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పనలో తెరకెక్కిన మర్డర్ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణయ్ సతీమణి అమృత హైకోర్టులో కంట్మెంట్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం దర్శకుడు రాంగోపాల్, మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు. తన కథనే చిత్రంగా తీసి... కోర్టును తప్పుదోవపట్టించారంటున్నారని ఆమె ఫిటిషన్లో పేర్కొన్నారు. లంచ్ పిటిషన్‌ను విచారించాలని న్యాయస్థానాన్ని అమృత కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మర్డర్’ మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బుధవారం సినిమా విడుదలకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.