చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
మొత్తంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం.
పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్‌కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది.
ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్‌ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్‌కి సెట్ చేయవచ్చు. లైవ్‌షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment