Music Albums
-
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా..
‘రీబర్త్’, ‘టాబూ’ ‘హరికేన్’లాంటి పాటలతో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అనుష్క జగ్ లేటెస్ట్ సింగిల్ ‘ఖుషీ ఖుషీ’ వైబ్రెంట్ యానిమేటెడ్ వీడియోతో విడుదల అయింది. తన యూనిక్ వాయిస్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న అనుష్క తాజాగా ‘ఖుషీ ఖుషీ’తో స్వరసందడి చేస్తోంది. ‘ఖుషీ ఖుషీ అనేది స్పిరిచ్యువల్ పాప్’ అంటుంది అనుష్క.కాలేజీ రోజుల నుంచి అనుష్కకు ఫిలాసఫీ అంటే ఇష్టం. తాజా పాటలో ఫిలాసఫీ కనిపిస్తుంది. అయితే భారంగా, సంక్లిష్టంగా కాకుండా యూత్‌ఫుల్ స్టైల్లో లిరిక్స్ ఉంటాయి. టైటిల్ హిందీలో ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి.‘హ్యాపీ ఈజ్ ఏ ఫీలింగ్ ఐ హ్యావ్ గాట్ హ్యాపీ ఈజ్ ఏ స్విచ్ ఇన్ మై హార్ట్’లాంటి లిరిక్స్‌తో ‘ఖుషీ ఖుషీ’ దూసుకుపోతోంది. తనను తాను ‘మ్యూజికల్ టూరిస్ట్’గా చెప్పుకునే అనుష్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ్రపాంతాలలో కచేరీలు ఇచ్చింది. జెన్నిఫర్ ఓనీల్, జాన్ జోన్స్, డడ్డీ బ్రౌన్, డానీ పాపిట్, కైల్ కెల్పోలాంటి సంగీతకారులతో కలిసి పనిచేసింది. ప్రతి కొత్త ్రపాజెక్ట్లో తనదైన ప్రతిభ చూపుతుంది అనుష్క. ఇండియన్ మెలోడీలు, రిథమ్లతో ప్రవాసభారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది అనుష్క జగ్. -
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్‌ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్‌కి సెట్ చేయవచ్చు. లైవ్‌షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
పాటే కథలా! సరికొత్త మ్యూజిక్ తరాన!
ఢిల్లీకి చెందిన తరాన మర్వాహ్ కంపోజర్, సింగర్, మల్టీ–ఇన్స్ట్రుమెంటలిస్ట్. ఏడు సంవత్సరాల వయసు నుంచే పియానో ప్లే చేసేది. రకరకాల మ్యూజిక్ స్టైల్స్‌ను నేర్చుకుంది. జీవితంలోని సకల కోణాలను సంగీత స్వరాలలో ప్రతిఫలింపజేయడం తనకు ఇష్టం. ‘కోమోరేబీ’ అనే మ్యూజిక్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసి రకరకాల జానర్లను మిక్స్ చేసింది. బాల్యంలో ఎన్నో కామిక్స్, యానిమేషన్లు తనపై ప్రభావం చూపాయి. ఆ ప్రభావంతో పాటను కథలా చెప్పాలనేది తన పాలసీగా మారింది. ‘జపాన్ లార్జర్–దేన్–లైఫ్ కల్చర్, ఫాంటాస్టిక్ స్టోరీలైన్స్, ప్లాట్స్, విజువల్స్ అంటే నాకు ఇష్టం. నేను మ్యూజిషియన్ కావడానికి అదే ఇన్స్పిరేషన్’ అంటుంది తరాన. జపనీస్ యానిమేషన్ ‘కోమోరేబీ’ని స్ఫూర్తిగా తీసుకొని అదే పేరుతో డెబ్యూ ఈపీని తీసుకువచ్చింది. తరాన చేయి తిరిగిన గేమర్ కూడా. డిఫరెంట్ మీడియమ్స్‌లో ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఆ అనుభవం వృథా పోలేదు. ఆ హుషారు, దూకుడు మ్యూజిక్‌లోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘మేడ్ ఇన్ హెవెన్’ ‘దహాద్’ ‘మోడ్రన్ లవ్’లాంటి పాపులర్ వోటీటీ షోలకు మ్యూజిక్ అందించింది తరాన. (చదవండి: హ్యండ్ల్యూమ్స్తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!) -
‘యంగ్ హేట్’తో పాపులారిటీని సంపాదించుకున్న సింగర్
దిల్లీకి చెందిన శిజ్య గుప్తా బహుముఖప్రజ్ఞాశాలి. సింగర్, ఎలక్ట్రానిక్ ప్రొడ్యూసర్, విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా తన ప్రత్యేకత చాటుకుంటుంది. శిజ్యకు బాల్యం నుంచి సంగీతం అంటే ఇష్టం. ఆసక్తి మాట ఎలా ఉన్నా తన మ్యూజికల్ జర్నీ మాత్రం ఆలస్యంగానే మొదలైంది. మహిళల కోసం నిర్వహించిన మ్యూజిక్ వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత తనకు కూడా ఏదైనా చేయాలనిపించింది. నోయిడాలో జరిగిన గ్లోబల్ మ్యూజిక్ స్కూల్ క్లాసులకు హాజరైన తరువాత ట్యూన్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ సింగిల్ ‘యంగ్ హేట్’తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. రాజస్థాన్‌లో జరిగిన మాగ్నటిక్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఫస్ట్ లైవ్ పెర్ఫార్మెన్స్తో ‘వావ్’ అనిపించుకుంది. శిజ్య మిత్రబృందంలో ఫిల్మ్‌మేకర్స్, యానిమేటర్స్, ఆర్టిస్ట్‌లు... మొదలైనవారు ఉన్నారు. వారితో కలిసి సృజనాత్మక చర్చలు చేయడం అంటే ఆమెకు ఇష్టం. ఆ చర్చలు ఎప్పుడూ వృథా పోలేదు. ఏదో ఒక కొత్త ఐడియా ఆ చర్చల్లో నుంచి పుట్టేది.మొదట్లో తనకు పాటలు రాయడం పెద్దగా ఇష్టం లేదు. అయితే సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలలో చెప్పాలనే ఆలోచన వచ్చిన తరువాత కలానికి పని చెప్పింది. ‘సృజనాత్మక ప్రయాణంలో ప్రతి అడుగు ఎంతో శక్తిని ఇస్తుంది...అనే మాటను తరచుగా వినేదాన్ని. ఇప్పుడు అది స్వయంగా అనుభవంలోకి వస్తోంది’ అంటుంది శిజ్య గుప్తా. ట్యూన్ కోసం మెదడుకు పని చెప్పినా, వచ్చిన ట్యూన్‌కు పసందైన పదాలు అల్లడానికి కలం పట్టినా, డిజిటల్ ఆడియో మ్యూజిక్ స్టేషన్లోకి వెళ్లినా, కీ బోర్డ్ ముందు కూర్చున్నా, తబలా వాయించినా, మ్యూజిక్ ఆల్బమ్ కోసం కవర్ డిజైన్ చేసినా.... ప్రతి సృజనాత్మక పనిలోనూ చెప్పలేనంత ఆనందం సొంతం చేసుకుంటుంది. -
యూత్‌ని రాక్ చేస్తున్న మాషప్ మ్యానియా
-
Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు
ఈ అబ్బాయికి తన వయసు వారిలాగే సినిమాలు అంటే ఇష్టం. సినిమా పాటలు అంటే ఇష్టం. ఆ పాటలకు తీన్మార్ డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. అయితే వీటితో పాటు తనకు టెక్నాలజీ అంటే కూడా ఇష్టం. ఆ ఇష్టమే ఇతడిని 14 సంవత్సరాల వయసులో కంటెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం అయింది. 21 సంవత్సరాల వయసులో సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి, మరో కంపెనీలో భాగస్వామి కావడానికి కారణం అయింది... టిక్‌టాక్‌తో ఊపందుకున్న షార్ట్ ఫామ్ కంటెంట్ ఆ తరువాత యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్... మొదలైన మాధ్యమాల ద్వారా మరింత విస్తరించింది. షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ప్రేక్షకులకు అందే వినోదం అనేది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల రకరకాల జానర్లలో ఎంతోమంది యువప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్ స్ట్రీమర్స్ పెరిగారు.వీరిని రకరకాల బ్రాండ్స్ తమ మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్‌తో పోల్చితే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.ఇన్ఫ్లుయెన్సర్లు, బ్రాండ్లకు మధ్య వారధిగా ముంబైలో ఏర్పడిన ‘నోఫిల్టర్’ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ముంబైకి చెందిన రుత్విక్ లోఖండె ఒకరు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. క్రిప్టో కరెన్సీ నేపథ్యంలో అందరిలాగే బ్లాక్‌చెయిన్ అనే మాటను చాలాసార్లు విన్నాడు రుత్విక్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) భద్రతకు ఉపకరించే, డేటాను జాగ్రత్తగా కాపాడే, పారదర్శకతకు వీలయ్యే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ రుత్విక్‌ను బాగా ఆకర్షించింది. ‘ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని ఆలోచించాడు. ‘ఇలా ఉపయోగించుకోవచ్చు’ అనే ఐడియా తట్టడంతో బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా ‘బిలీవర్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి సూపర్‌హిట్ చేశాడు. ఈ ప్లాట్‌ఫామ్ కళాకారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు... రైటర్ లేదా డైరెక్టర్ కావాలనుకుంటున్నవారు తమ స్క్రిప్ట్‌ను షేర్ చేస్తే, అది ఆడియెన్స్(బిలీవర్స్)కు నచ్చితే నిధుల సమీకరణకు వీలవుతుంది. ‘షార్ట్ కంటెంట్ అనేది హోటల్స్ నుంచి టూర్గైడ్ల వరకు ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటున్న రుత్విక్ ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సంస్థ ‘కొలబ్ట్రైబ్’ భాగస్వామి. ‘ప్రస్తుతం మన దేశంలో స్ట్రీట్కల్చర్ పెరిగింది. హిప్ హాప్ టాలెంట్ ముందుకు వస్తుంది. మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి ఎంతో టైమ్ పట్టడం లేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దగ్గర వీరి ప్రతిభకు సరిౖయెన ప్రతిఫలం లభించడం లేదు. 2025 నాటికి కంటెంట్ క్రియేషన్‌కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచుల ప్రకారం ఇన్ఫ్లూయెన్సర్ కావచ్చు, అయితే ప్రతిభ మాత్రమే సరిపోదు. తమ కంటెంట్‌ను ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్కిల్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి’ అంటున్నాడు రుత్విక్. కంటెంట్ క్రియేషన్‌లో వ్యక్తులు, సంస్థలకు సహాయపడడానికి ఏంజెల్ ఫండ్ ‘మూన్ క్యాపిటల్’ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడు రుత్విక్. ‘ప్రతిభకు ఎలాంటి హద్దులు, అవరోధాలు లేవు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది’ అంటున్నాడు యంగ్‌స్టార్ రిత్విక్. తన సక్సెస్ స్టోరీ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది కదా! -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్
వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్ మేజ్ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది కొలెట్ట్. 1914 జూన్ 16 న ఫ్రెంచ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్ మేజ్. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్‌గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్ పియానో వదల్లేదు. ఆరో ఆల్బమ్.. షూమాన్, క్లాడ్ డెబస్సీ మ్యూజిక్‌ను ఇష్టపడే కొలెట్. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్ విడుదల చేసిన కొలెట్ట్. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్ ఇంజినీర్ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. సలాడ్ కన్నా ఆత్మీయ ఆహారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్ మేజ్... సలాడ్ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ. -
ఈ ‘ఐటమ్ సాంగ్’ను స్కూల్లో పాఠంగా చేర్చారు!
‘సినిమా బాగుందా?’ అనే ప్రశ్నతో పాటు ‘ఐటమ్ సాంగ్ ఉందా?’ అనే ఉపప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. ‘ఈ సందర్భంలో ఇలాంటి పాట ఉండాలి’ అనేది సినిమా రూల్. అయితే ఐటమ్‌సాంగ్ మాత్రం కచ్చితంగా పక్కాగా మాస్ పాటై ఉండాలి. అలాంటి ఒక మాస్ పాటకు ఇప్పుడు మహర్దశ పట్టింది. సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ సినిమాలో ‘మున్నీ బద్నామ్ హుయి’ ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. ఈ పాటను ‘ఇంగ్లాండ్ న్యూ మ్యూజిక్ కరికులమ్’లో చేరుస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ (డిఎఫ్యి) న్యూ కరికులమ్ గైడ్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. బ్రిటన్‌లోని టీచర్స్, ఎడ్యుకేషన్ లీడర్స్, సంగీతకారులలో నుంచి ఎంపిక చేసిన 15 మంది అత్యున్నత బృందం ‘మోడల్ మ్యూజిక్ కరికులమ్’ను అభివృద్ధి చేసింది. మన శాస్త్రీయ సంగీత పాఠాలతో పాటు భాంగ్రా బీట్, ఐటమ్‌సాంగ్స్‌ను చేరుస్తున్నారు. ‘జయహో’, సహేలిరే, ఇండియన్ సమ్మర్... మొదలైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని జానర్స్‌లోని ఈ పాటలు సంగీతం నేర్చుకునే విద్యార్థులకు పాఠాలు, కేస్స్టడీలుగా ఉపయోగపడతాయి. ‘హుషారెత్తించి సంగీతంతో పాటు కలర్‌ఫుల్ విజువల్స్ ఈ పాట ప్రత్యేకం’ అని ‘మున్నీ బద్నామ్ హుయి’ పాటకు కితాబు ఇచ్చింది బృందం. -
అనుకున్నదే జరిగింది
సినిమా: ఏం జరగాలని కోరుకున్నానో, అదే జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంది నటి శ్రుతీహాసన్. ఈ సంచలన నటి దక్షిణాది చిత్రాల్లో నటించి రెండేళ్లకు పైనే అయ్యింది. సింగం–3 తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. ఇక టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే హిందీలో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. సంగీత ఆల్బమ్స్‌పై మక్కువ చూపిస్తున్న ఈ బ్యూటీ బుల్లితెర యాంకరింగ్‌లోనూ ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటివరకూ కోలీవుడ్‌లో కొత్త చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే తనదైన ధోరణిలో ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటోంది. అదే విధంగా ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. గ్లామరస్ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అభిమానులతో ముచ్చటించడం వంటివి చేస్తూనే ఉంది. ఇదిలాఉండగా శ్రుతీహాసన్ ఇటీవల తాను ఏం జరగాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నానో అది జరిగింది అని, ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది. అన్ని మంచి విషయాలను ఆ భగవంతుడు తనకు ప్రసాదించారు అని అంది. దీంతో శ్రుతీహాసన్ దేని గురించి మాట్లాడుతోంది? అసలు ఏం చెప్పాలనుకుందో? తెలియక ఆమె అభిమానులు జుత్తు పీక్కుంటున్నారు. అసలు విషయం ఏమిటో శ్రుతీహాసన్ వివరిస్తే గానీ అభిమానులు ఆనందించే పరిస్థితి లేదు. ఇటీవల ఇదేవిధంగా నటి తమన్నా అంటే తనకు చాలా ఇష్టం అని, తనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని అంది. అంతే కాదు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. -
సెలబస్: కీరప్పొడి
కీరవాణి సకల కళా వల్లభుడు. ఆయన విద్వత్తుని కేవలం సంగీతంతోనే తూచలేం. ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. మనుషుల్ని ఇంకా బాగా చదువుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. రాగయుక్తంగా... భావ యుక్తంగా...చమత్కారంగా... వెటకారంగా... ఇంకా చాలా రకాలుగా మాట్లాడగలరాయన. ఇన్స్పయిరైతే మాత్రం చకచకా పొయిట్రీ కూడా చెప్పేయగలరు. గోపరాజు రాధాకృష్ణ అనే రచయిత ‘ఆల్బమ్’ అనే హైకూ సదృశ కవితల పుస్తకం ఇస్తే, కీరవాణి చదివి బాగా ఇంప్రెస్ అయిపోయారు. ‘అరె... భలే ఉన్నాయ్. నాక్కూడా రాయాలనిపిస్తోంది’ అంటూ టకటకా, అలవోకగా కొన్ని హైకూలు రాసేశారు. ఇవన్నీ ‘సాక్షి’కి ప్రత్యేకం. -
నకిలీ బ్రిట్నీ కావలెను!
ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కచ్చితంగా ఉంటారు. ఈ అందగత్తెకు ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు బ్రిట్నీ రూపొందించే సరికొత్త మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఓ మ్యూజిక్ వీడియో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బ్రిట్నీ. ఈ వీడియోలోని కొన్ని సన్నివేశాల్లో తనలా ఉన్న అమ్మాయిని నటింపజేయాలనుకుంటున్నారామె. నకిలీ బ్రిట్నీని వెతకడం కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి, ఓ ఆంగ్ల పత్రిక ద్వారా తన శరీర కొలతల్ని బయటపెట్టారు బ్రిట్ని. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, శరీర కొలతలు 32-27-35, డ్రెస్ సైజ్ 4, షూ సైజ్ 7 ఉంటే చాలు.... నకిలీ బ్రిట్నీగా పనికొస్తారట. ఒకవేళ సేమ్ టు సేమ్ ఈ కొలతలు లేకపోయినా.... కొంచెం దగ్గరగా ఉన్నా చాలు, సర్దుకుపోదాం అంటున్నారు బ్రిట్నీ. ఈ ప్రకటన ఇలా వెలువడిందో లేదో ఈ కొలతలు ఉన్న ఆడవాళ్లు... దరఖాస్తుతో రెడీ అయ్యి, బ్రిట్నీ ఆఫీసు ముందు గుమిగూడారట. వీళ్లల్లో బ్రిట్నీకి డూప్‌గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వాళ్లు ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నకిలీ బ్రిట్నీగా నటించడానికి అమ్మాయిలు పోటీపడుతుంటే, అబ్బాయిల్లో బ్రిట్నీ అభిమానులు మాత్రం ఆమె కొలతలు తెలిసినందుకు పరమానందపడిపోతున్నారట.