Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా.. | International Music Artist Anushka Jag's Success Story | Sakshi
Sakshi News home page

Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా..

Published Fri, Jun 28 2024 9:15 AM | Last Updated on Fri, Jun 28 2024 10:03 AM

International Music Artist Anushka Jag's Success Story

‘రీబర్త్‌’, ‘టాబూ’ ‘హరికేన్‌’లాంటి పాటలతో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌ అనుష్క జగ్‌ లేటెస్ట్‌ సింగిల్‌ ‘ఖుషీ ఖుషీ’ వైబ్రెంట్‌ యానిమేటెడ్‌ వీడియోతో విడుదల అయింది. తన యూనిక్‌ వాయిస్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న అనుష్క తాజాగా ‘ఖుషీ ఖుషీ’తో స్వరసందడి చేస్తోంది. ‘ఖుషీ ఖుషీ అనేది స్పిరిచ్యువల్‌ పాప్‌’ అంటుంది అనుష్క.

కాలేజీ రోజుల నుంచి అనుష్కకు ఫిలాసఫీ అంటే ఇష్టం. తాజా పాటలో ఫిలాసఫీ కనిపిస్తుంది. అయితే భారంగా, సంక్లిష్టంగా కాకుండా యూత్‌ఫుల్‌ స్టైల్‌లో లిరిక్స్‌ ఉంటాయి. టైటిల్‌  హిందీలో ఉన్నప్పటికీ లిరిక్స్‌ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి.

‘హ్యాపీ ఈజ్‌ ఏ ఫీలింగ్‌ ఐ హ్యావ్‌ గాట్‌ హ్యాపీ ఈజ్‌ ఏ  స్విచ్‌ ఇన్‌ మై హార్ట్‌’లాంటి లిరిక్స్‌తో ‘ఖుషీ ఖుషీ’ దూసుకుపోతోంది. తనను తాను ‘మ్యూజికల్‌ టూరిస్ట్‌’గా చెప్పుకునే అనుష్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ్రపాంతాలలో కచేరీలు ఇచ్చింది. జెన్నిఫర్‌ ఓనీల్, జాన్‌ జోన్స్, డడ్డీ బ్రౌన్, డానీ పాపిట్, కైల్‌ కెల్పోలాంటి సంగీతకారులతో కలిసి పనిచేసింది. ప్రతి కొత్త ్రపాజెక్ట్‌లో తనదైన ప్రతిభ చూపుతుంది అనుష్క. ఇండియన్‌ మెలోడీలు, రిథమ్‌లతో ప్రవాసభారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది అనుష్క జగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement