టాలీవుడ్ రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విజయ్ దేవరకొండ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి సాంగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 'సాహిబా' అనే పాట కోసం రాధిక మదన్‌తో కలిసి విజయ్ కనిపించారు. బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సింగర్ జస్లిన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేశారు.
మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం విజయ్ దేవరకొండ గతంలో కూడా పనిచేశారు. సుమారు ఆరేళ్ల క్రితం 'నీ వెనకాలే నడిచి' అనే సాంగ్ కోసం ఆయన వర్క్ చేశారు. 2018లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్ కూడా అప్పట్లో ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు 'సాహిబా' కోసం సింగర్ జస్లిన్ రాయల్ ఫిదా చేశారు. 'హీరియే' పాటతో జస్లిన్ రాయల్ కూడా గతంలో భారీగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment