సెలబస్: కీరప్పొడి
కీరవాణి సకల కళా వల్లభుడు.
ఆయన విద్వత్తుని కేవలం సంగీతంతోనే తూచలేం.
ఆయన పుస్తకాలు బాగా చదువుతారు.
మనుషుల్ని ఇంకా బాగా చదువుతారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్.
రాగయుక్తంగా... భావ యుక్తంగా...చమత్కారంగా... వెటకారంగా... ఇంకా చాలా రకాలుగా మాట్లాడగలరాయన.
ఇన్‌స్పయిరైతే మాత్రం చకచకా పొయిట్రీ కూడా చెప్పేయగలరు. గోపరాజు రాధాకృష్ణ అనే రచయిత ‘ఆల్బమ్’ అనే హైకూ సదృశ కవితల పుస్తకం ఇస్తే, కీరవాణి చదివి బాగా ఇంప్రెస్ అయిపోయారు. ‘అరె... భలే ఉన్నాయ్. నాక్కూడా రాయాలనిపిస్తోంది’ అంటూ టకటకా, అలవోకగా కొన్ని హైకూలు రాసేశారు. ఇవన్నీ ‘సాక్షి’కి ప్రత్యేకం.