ఢిల్లీకి చెందిన తరాన మర్వాహ్ కంపోజర్, సింగర్, మల్టీ–ఇన్‌స్ట్రుమెంటలిస్ట్. ఏడు సంవత్సరాల వయసు నుంచే పియానో ప్లే చేసేది. రకరకాల మ్యూజిక్ స్టైల్స్‌ను నేర్చుకుంది. జీవితంలోని సకల కోణాలను సంగీత స్వరాలలో ప్రతిఫలింపజేయడం తనకు ఇష్టం. ‘కోమోరేబీ’ అనే మ్యూజిక్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసి రకరకాల జానర్‌లను మిక్స్ చేసింది. బాల్యంలో ఎన్నో కామిక్స్, యానిమేషన్‌లు తనపై ప్రభావం చూపాయి. ఆ ప్రభావంతో పాటను కథలా చెప్పాలనేది తన పాలసీగా మారింది.
‘జపాన్ లార్జర్–దేన్–లైఫ్ కల్చర్, ఫాంటాస్టిక్ స్టోరీలైన్స్, ప్లాట్స్, విజువల్స్ అంటే నాకు ఇష్టం. నేను మ్యూజిషియన్ కావడానికి అదే ఇన్‌స్పిరేషన్’ అంటుంది తరాన. జపనీస్ యానిమేషన్ ‘కోమోరేబీ’ని స్ఫూర్తిగా తీసుకొని అదే పేరుతో డెబ్యూ ఈపీని తీసుకువచ్చింది. తరాన చేయి తిరిగిన గేమర్ కూడా. డిఫరెంట్ మీడియమ్స్‌లో ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఆ అనుభవం వృథా పోలేదు. ఆ హుషారు, దూకుడు మ్యూజిక్‌లోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘మేడ్ ఇన్ హెవెన్’ ‘దహాద్’ ‘మోడ్రన్ లవ్’లాంటి పాపులర్ వోటీటీ షోలకు మ్యూజిక్ అందించింది తరాన.
(చదవండి: హ్యండ్ల్యూమ్స్‌తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!)
Comments
Please login to add a commentAdd a comment