యూట్యూబ్ మాజీ సీఈఓ కన్నుమూత | YouTube Ex CEO Susan Wojcicki Dies | Sakshi
Sakshi News home page

యూట్యూబ్ మాజీ సీఈఓ కన్నుమూత

Published Sat, Aug 10 2024 3:42 PM | Last Updated on Sat, Aug 10 2024 3:47 PM

YouTube Ex CEO Susan Wojcicki Dies

యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు.

సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు. జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి, చాలా మందికి మంచి స్నేహితురాలు. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎనలేనిదని అన్నారు.

సుసాన్ వొజ్కికి మరణం టెక్ ప్రపంచానికి తీరని లోటు అని చాలామంది నివాళులు అర్పించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్యాన్సర్‌తో పోరాడి నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వొజ్కికిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement