న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నియామకాలు పెరిగాయి. ఈ రంగంలో నియామకాల వృద్ధి గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం పెరిగింది. నియామకాల పెరుగుదలకు డిజిటల్ మీడియా, శాటిలైట్ టీవీ వంటి తదితర విభాగాల విస్తరణే కారణం. ఈ విషయం టైమ్స్‌జాబ్స్‌డాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది.
గత ఏడాది కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, జర్నలిజం నిపుణుల డిమాండ్ బాగా పెరిగింది. వీరిలో ముఖ్యంగా ప్రారంభ స్థాయి, ఐదేళ్లలోపు అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా (60 శాతంగా) ఉంది. ఈ డిమాండ్‌లో 50 శాతం ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల నుంచే ఉంది. తర్వాతి స్థానాల్లో హైద రాబాద్, పుణే, అహ్మదాబాద్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో మీడియా సంబంధిత యాప్‌ల వినియోగం పెరిగిందని తద్వారా సోషల్ మీడియా నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింఈని టైమ్స్‌జాబ్స్‌డాట్‌కామ్ వెల్లడించింది.
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నియామకాల జోరు
Published Tue, Jul 7 2015 12:23 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement