
సిడ్నీ: ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలపై అమెరికా, బ్రిటన్‌ల తర్వాత ప్రస్తుతం ఆస్ర్టేలియా నిఘా పెట్టింది. వార్తా ప్రకటనలు, అసత్య కథనాలపైనా కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫాం కార్యకలాపాలను పరిశీలించానలి ఆస్ర్టేలియన్ కాంపింటీషన్ కన్సూమర్ కమిషన్‌ను(ఏసీసీసీ) ప్రభుత్వం కోరినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. ఆస్ర్టేలియాలో ఫేస్‌బుక్,గూగుల్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫాంల ప్రభావంపై తాము పూర్తిస్ధాయిలో అథ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీసీసీ ఛైర్మన్ రాడ్ సిమ్స్ చెప్పారు.
విచారణలో భాగంగా డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా వేదికలనూ జల్లెడపట్టనున్నారు.ఆయా సంస్థలు విదేశాల నుంచి పనిచేస్తున్నా తమ సమాచార వ్యవస్థలు వాటిని లొకేట్ చేస్తాయని సిమ్స్ తెలిపారు. అసత్య వార్తలు వైరల్ అవుతున్న అంశాన్నీ తమ విచారణ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.