
టెల్‌అవీవ్:మధ్య ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్ నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. మరో రెండు బస్సుల్లో దొరికిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.
వరుస పేలుళ్లతో దేశవ్యాప్తంగా బస్సులు,రైళ్లలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఎవరు పెట్టారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో దొరికన పేలుడు పదార్థాలను పోలినట్లు తాజాగా దొరికన బాంబులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు హమాస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఖస్సమ్ బ్రిగేడ్స్ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెస్ట్‌బ్యాంక్‌లోని తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బబ్రిగేడ్స్ తాజాగా సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌పై దాడులు మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment