పేలుళ్ల మోతతో దద్దరిల్లిన వరంగల్‌ | Blast rips through Warangal cracker-making unit, 8 killed | Sakshi
Sakshi News home page

పేలుళ్ల మోతతో దద్దరిల్లిన వరంగల్‌

Published Thu, Jul 5 2018 9:48 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

వరంగల్‌కు చెందిన గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ అలియాస్‌ బాంబుల కుమార్‌ కాశి బుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ పేరుతో టపాసుల విక్రయాలు చేస్తున్నాడు. ఈ గోదాములో సుమారు 60 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది గోదాములో ఉన్నట్లు సమాచారం. కాజీపేటకు చెందిన ఓ మహిళ మరణించడంతో ఆమె శవయాత్రలో బాణసంచా కాల్చేందుకు బందెల సారంగపాణి, బండారి సమ్మయ్య, రాజు, మహేశ్‌ ఉదయం 11 గంటల సమయంలో ఈ గోడౌన్‌ వద్దకు వచ్చారు. కంపెనీ ఔట్‌లెట్‌లో టపాసులు బేరం చేస్తున్నారు. ఇంతలో శక్తివంతమైన టపాసులు లోపలి నుంచి తెస్తానంటూ ఓ వర్కర్‌ తయారీ విభాగంలోకి వెళ్లాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement