బీరుట్: లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్‌ను దేవుడే రక్షించు గాక’ అని టీవీలో తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించారు.
(చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్)
నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా
Published Tue, Aug 11 2020 3:33 PM | Last Updated on Tue, Aug 11 2020 8:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment