
సాక్షి, కర్నూలు: ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి పైగా మృత్యువాత పడగా, మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. పేలుళ్ల కారణంగా బండరాళ్లు మీద పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బండరాళ్ల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ పేలుళ్లతో క్వారీలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి మూడు ట్రాక్టర్లు, లారీ, రెండు షెడ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. షెడ్లలో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment