
హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీసర్కిల్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ ఇంట్లో రెడ్‌మీ నోట్–4 సెల్‌ఫోన్ పేలింది. మధ్యాహ్నం చార్జింగ్ పెట్టి ఉంచడంతో కొంత సేపటికి పెద్ద శబ్ధంతో సెల్‌ఫోన్ పేలడంతో ఇంట్లో కలకలం రేగింది. కొద్దిసేపటి ముందు షర్టు ప్యాకెట్‌లో ఫోన్ ఉంచుకున్నానని.. అప్పుడు పేలి ఉంటే పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే గుండె జలదరిస్తోందని లక్ష్మీనారాయణ తెలిపారు. వెంటనే షోరూమ్‌కు వెళ్లి సెల్‌ఫోన్ చూపించగా.. ఏజెన్సీతో మాట్లాడి మరొకటి ఇప్పించేందుకు ఒప్పించారు. ఒకే కంపెనీకి చెందిన ఫోన్లు అధిక శాతం పేలుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.