కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం బుధవారం బాంబులతో దద్దరిల్లింది. పశ్చిమ కాబూల్లోని కార్ట్ - ఈ- చార్ ప్రాంతంలోని జాతీయ రహదారి వద్ద అమర్చిన రెండు శక్తిమంతమైన బాంబులు వెంటవెంటనే పేలాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రత సిబ్బందిని తీసుకువెళ్తున్న ప్రభుత్వ బస్సు లక్ష్యంగా ఈ బాంబు పేలుడు సంభవించిందని అన్నారు.
ఈ పేలుళ్లలో ఎవరు గాయపడలేదని తెలిపారు. తాలిబన్లే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఆఫ్ఘాన్ - యూఎస్ మధ్య ద్వైపాక్షి భద్రత ఒప్పందంపై సంతకం చేసుకున్న మరునాడే ఈ పేలుళ్లు సంభవించాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.