అక్రా: పశ్చిమ ఘనాలో భారీ పేలుడు సంభవించింది. బోగోసో ప్రాంతం సమీపంలో ట్రక్, మోటర్ బైక్ను ఢీకొని పేలుడు చోటుచేసుకుంది. అధికారుల ప్రకారం.. మైనింగ్ కంపెనీకి పేలుడు పదార్థాలు తరలిస్తున్న ట్రక్ ప్రమాదానికి గురైంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని మేఘాలు అలుముకున్నాయి.
పేలుడు బీభత్సానికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు.. 17 మంది మృతి చెందగా, మరో 59 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అధికారులు సంఘటన స్థలానికి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అక్రూఫో అడ్డో స్పందించారు.
ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ 59 మందిలో.. 42 మందిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
Comments
Please login to add a commentAdd a comment