
మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం
ఆ చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో సహాయం కోసం డ్రైవర్ మంటలతో అలానే మూడు కిలోమీటర్లు తీసుకెళ్లాడు. అప్పటికే వాహనం వెనుక భాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో భయాందోళనకు గురైన డ్రైవర్ దారిలో ఉన్న టోల్ ప్లాజా దగ్గర ఆపి అక్కడివారిని ప్రమాదం నుంచి కాపాడాలని కోరాడు. దీంతో టోల్ సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.