ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి | Road Accident in China | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి

Published Sun, Jul 1 2018 2:50 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road Accident in China - Sakshi

బీజింగ్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందాగా, మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా రాజధాని బీజింగ్‌కు దక్షిణాన హునాన్ ప్రావిన్స్‌లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇరు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వీటిలో ఓ వాహనం డివైడర్‌ను దాటి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.  ప్రతి సంవత్సరం సుమారు 2.6 లక్షల మంది చైనీయులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement