భారీ పేలుడు ఐదుగురు సజీవ దహనం | Fireworks Explosion Five People Burnt Alive | Sakshi
Sakshi News home page

బాణాసంచా పేలి ఐదుగురు సజీవ దహనం

Published Fri, Oct 23 2020 4:45 PM | Last Updated on Fri, Oct 23 2020 6:58 PM

Fireworks Explosion Five People Burnt Alive - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో.. అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్‌ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement