public events
-
అలా జరిగేసరికి..ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయి.. మైక్ విసిరి..
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ జిల్లా పర్యటనలో విచిత్రమైన పరిణామం ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అసహనం కోల్పోయి మైక్ విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. నిజానికి ఆశోక్ గెహ్లాట్ బార్మర్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం వారితో సంభాషిస్తుండగా ఈ విచిత్ర పరిణామం ఎదురైంది. ఆ కార్యక్రమంలో ఆ పథకాలన ప్రయోజనాల గురించి వారిని ఆరా తీస్తున్నారు గెహ్లాట్. సరిగ్గా ఆ టైంలో మైక్ సరిగా పనిచేయడం మానేసింది. దీంతో గెహ్లాట్ బార్మర్ జిల్లా కలెక్టర్ నిలబడి ఉన్న ఎడమవైపు మైకుని విసిరారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎక్కడ ఉన్నారంటూ.. మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ ఒకేలా కనిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంతలో ఓ మహిళ మైక్ ఇవ్వడంతో..శాంతించి కాస్త నిదానంగా దానితో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట హల్చల్ చేయడమే గాక సీఎం కలెక్టర్‌పైకి మైక్ విసిరేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే దీనిపై స్పందించింది. ఆయన జిల్లా కలెక్టర్లపై మైక్రోఫోన్ విసరలేదంటూ ఆ వ్యాఖ్యలను ఖండించింది. Ashok Gehlot gets angry and throws Mike(not working) at an official pic.twitter.com/fa3d5Ea4h1 — Hemir Desai (@hemirdesai) June 3, 2023 (చదవండి: ఒడిశా రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు) -
'మా ఆయనను చూపించడం నాకు చాలా ఇష్టం'
లండన్: తన భర్తను బయటి ప్రపంచానికి చూపించడం అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ హాలీవుడ్ సింగర్ క్యారీ అండర్ వుడ్ చెప్పింది. అందుకే తాను బహిరంగంగా జరిగే కార్యక్రమాలకు తనను తీసుకెళ్తుంటానని వెల్లడించింది. ఈ నెల 8న టెన్నిస్సేలోని నేష్ విల్లీలో జరిగిన సీఎంటీ అవార్డుల కార్యక్రమంలో పింక్ కార్పేట్‌పై హొయలు వలికిస్తూ తన భర్త, హాకీ ప్లేయర్ మైక్ ఫిషర్ తో కలిసి నడిచిన ఆమె తన భర్త అంటే ఎంత ఇష్టమో చెప్పారు. హాకీ ప్లేయర్ అయిన తన భర్త మైక్ ఫిషర్ తనతో కలిసి ఫంక్షన్లకు హాజరుకావడం చాలా అరుదు అని, అందుకే తాను సమయం చిక్కినప్పుడల్లా తనను వెంటపెట్టుకొని తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంటానని చెప్పింది. అతడితో ఉండే ఏ సందర్భం అయినా తనకు చాలా ఇష్టమని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. -
అమ్మతో... నాని
అమ్మతో అనుబంధం ఎవరికైనా ఆజన్మాంతపు మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ మనల్ని వేలు పట్టుకొని నడి పిస్తే... మనం పెద్దయ్యాక, అమ్మ మరీ పెద్దదయ్యాక... ఆమె చేయిపట్టుకొని నడిపించడం పిల్లలుగా మన బాధ్యత. ఆ క్షణంలో తాను కంటికి రెప్పలా కాపాడిన బిడ్డ, ఇప్పుడు తన కంటికి రెప్ప కావడం ఏ అమ్మకైనా వర్ణనాతీతమైన ఆనందం. ఢిల్లీకి రాజైనా... బాక్సాఫీస్ రారాజైనా... అమ్మకు బిడ్డే అనేది అందుకే. ఆ మధుర క్షణాలను హీరో మహేశ్‌బాబు తల్లి ఇందిర సోమవారం మరోసారి ఆస్వాదించారు. సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడైన నిర్మాత జి. ఆదిశేషగిరిరావు, లలితా ప్రమీల దంపతుల తనయుడి వివాహ నిశ్చితార్థంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఘట్టమనేని సాయిరాఘవ రత్నబాబు (బాబీ)కీ, ప్రియాంకకూ హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. పెద్ద ఎన్టీఆర్ కుటుంబం, ఘట్టమనేని కుటుంబం ఆత్మీయంగా ముచ్చటించుకున్న ఈ వేడుకలో ఎప్పుడూ పబ్లిసిటీకి దూరంగా ఉండే, తన తల్లి చేయిపట్టుకొని నాని (మహేశ్ ముద్దుపేరు) నడుచుకుంటూ వచ్చిన దృశ్యం అందరినీ ఆకర్షించింది.