అమ్మతో... నాని | Mahesh Babu with his mother Indira | Sakshi
Sakshi News home page

అమ్మతో... నాని

Published Tue, Jun 9 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

అమ్మతో... నాని

అమ్మతో... నాని

అమ్మతో అనుబంధం ఎవరికైనా ఆజన్మాంతపు మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ మనల్ని వేలు పట్టుకొని నడి పిస్తే... మనం పెద్దయ్యాక, అమ్మ మరీ పెద్దదయ్యాక... ఆమె చేయిపట్టుకొని నడిపించడం పిల్లలుగా మన బాధ్యత. ఆ క్షణంలో తాను కంటికి రెప్పలా కాపాడిన బిడ్డ, ఇప్పుడు తన కంటికి రెప్ప కావడం ఏ అమ్మకైనా వర్ణనాతీతమైన ఆనందం. ఢిల్లీకి రాజైనా... బాక్సాఫీస్ రారాజైనా... అమ్మకు బిడ్డే అనేది అందుకే. ఆ మధుర క్షణాలను హీరో మహేశ్‌బాబు తల్లి ఇందిర సోమవారం మరోసారి ఆస్వాదించారు. సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడైన నిర్మాత జి. ఆదిశేషగిరిరావు, లలితా ప్రమీల దంపతుల తనయుడి వివాహ నిశ్చితార్థంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
 
  ఘట్టమనేని సాయిరాఘవ రత్నబాబు (బాబీ)కీ, ప్రియాంకకూ హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. పెద్ద ఎన్టీఆర్ కుటుంబం, ఘట్టమనేని కుటుంబం ఆత్మీయంగా ముచ్చటించుకున్న ఈ వేడుకలో ఎప్పుడూ పబ్లిసిటీకి దూరంగా ఉండే, తన తల్లి చేయిపట్టుకొని నాని (మహేశ్ ముద్దుపేరు) నడుచుకుంటూ వచ్చిన దృశ్యం అందరినీ ఆకర్షించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement