న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కేంద్ర ప్రత్యక పన్నుల మండలి (సీబీడీటీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళ తిరునువంతపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు ఉన్న ఆస్తులు, ఆదాయానికి.. ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో పొందుపరిచిన వివరాలు సమానంగా ఉన్నాయా? వ్యత్యాసం ఎమైనా ఉందా? అనేది పరిశీలించాలని కోరింది.
కాంగ్రెస్ ఫిర్యాదుతో
రాజీవ్ చంద్రశేఖర్ ఉన్న అసలు ఆస్తులకు, అఫిడవిట్‌లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలకు పొంతనలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కేరళలో అధికార పక్షమైన ఎల్డీఎఫ్‌లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో ఈసీఐ..ప్రత్యక్ష పన్ను మండలికి ఆదేశాలు జారీ చేసింది.
ఆదాయం రూ.680యే
2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే తన ఆదాయం కేవలం రూ. 680 అని చూపడంతో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్‌పై వివాదం చెలరేగింది.
పొంతనలేని ఆస్తుల వివరాలు
ఈ అఫిడవిట్‌పై కాంగ్రెస్, ఎల్డీఎఫ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజీవ్ చంద్ర శేఖర్‌కు ఉన్న అసలైన ఆస్తులు, అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలకు పొంతలేదని ఆరోపిస్తున్నాయి. బెంగళూరులోని ఆస్తులతో సహా ఇతర ఆస్తులను కేంద్ర మంత్రి వెల్లడించలేదని చెప్పాయి. జూపిటర్ క్యాపిటల్ అనే హోల్డింగ్ కంపెనీకి తనకు ఉన్న సంబంధం గురించి అఫిడవిట్‌లో ఎందుకు తెలపలేదని ఎల్‌డీఎఫ్ ప్రశ్నిస్తోంది.
ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రాజీవ్ చంద్రశేఖర్‌ను వ్యవస్థాపకుడిగా ఉన్నప్పటికీ తన నిజమైన ఆస్తులను దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ భారత ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో హైలెట్ చేసింది. ఈ ఫిర్యాదులపై బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం.. నా అఫిడవిట్ చట్టానికి లోబడి ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment