![కేటీఆర్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ భేటీ](/styles/webp/s3/article_images/2017/09/3/61457175295_625x300.jpg.webp?itok=LNL1ttFZ)
కేటీఆర్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ హబ్ విధానాన్ని రాజ్యసభ ఎంపీ, టెక్రోక్రాట్ రాజీవ్ చంద్రశేఖర్ మెచ్చుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ఆయన శనివారం కలుసుకుని టీ హబ్ చేపట్టినందుకు అభినందించారు. ప్రభుత్వ సేవలలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ సర్విసెస్ లో ప్రారంభించిన, ఈ-వాహన్ బీమా వంటి సేవలను మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడికి వివరించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీకి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా పౌర సేవలను ప్రభావవంతంగా అందించేందుకు అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.