
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా అధునాతన సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. తన ముందున్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రధానంగా వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా పోటీపడగలిగే టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దేశీ పరిజ్ఞానంతో డీఐఆర్–వి (డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ–వి) మైక్రోప్రాసెసర్ రూపకల్పనలో అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. మెయిటీ, ఐఐటీ మద్రాస్ నిర్వహించిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇందులో 700 మంది పైచిలుకు వి ద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు.