international standard
-
అధునాతన సిస్టమ్స్తయారీకి కేంద్రం బాసట
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా అధునాతన సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. తన ముందున్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రధానంగా వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా పోటీపడగలిగే టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశీ పరిజ్ఞానంతో డీఐఆర్–వి (డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వి) మైక్రోప్రాసెసర్ రూపకల్పనలో అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. మెయిటీ, ఐఐటీ మద్రాస్ నిర్వహించిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇందులో 700 మంది పైచిలుకు వి ద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
ELECRAMA 2023: ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయండి
నోయిడా: అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాగే వర్ధమాన దేశాలే కాకుండా సంపన్న మార్కెట్లనూ లక్ష్యంగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలెక్‌రమా 2023 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నేరుగా సంపన్న దేశాల మార్కెట్లలోకి వెళ్లి భారతదేశ సామర్థ్యాలను చాటి చెప్పాలని తయారీ సంస్థలకు మంత్రి సూచించారు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత విశ్వసనీయ భాగస్వాములతోనే కలిసి పని చేయడం ఎంత ముఖ్యమో యావత్ ప్రపంచం గుర్తెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు లావాదేవీలు జరిపేటప్పుడు పారదర్శకత, సమగ్రత, నిజాయితీని కోరుకుంటున్నాయని గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోకుండా సత్వరం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. -
‘నాడా’కు షాకిచ్చారు!
న్యూఢిల్లీ: భారత క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. ‘నాడా’కు చెందిన ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో ప్రమాణాలు బాగా లేవంటూ ఆరు నెలల పాటు గుర్తింపును రద్దు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో సొంత డోపింగ్ సంస్థపై నిషేధం ‘నాడా’ను ఇబ్బంది పరిచే అంశం. ‘ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ (ఐఎస్ఎల్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ వేదికలో సౌకర్యాలు లేవని ‘వాడా’ పరిశీలనలో తేలింది. అందుకే ఈ ల్యాబ్ గుర్తింపు రద్దు చేస్తున్నాం’ అని ‘వాడా’ ప్రకటించింది. తమ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇది జరిగినట్లు కూడా వెల్లడించింది. 20 ఆగస్టు, 2019 నుంచి ఎన్‌డీటీఎల్‌పై సస్పెన్షన్ వర్తిస్తుంది. ఇకపై అన్ని రకాల పరీక్షలు నిలిపేయాల్సిందిగా కూడా ‘వాడా’ ఆదేశించింది. అయితే శాంపిల్‌ను తీసుకునే అవకాశం మాత్రం ‘నాడా’కు ఉంది. వాటిని తాము పరీక్షించకుండా ఇతర గుర్తింపు పొందిన సంస్థకు పంపించాల్సి ఉంటుంది. తాజా చర్యపై కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో 21 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఎన్డీటీఎల్కు ఉంది. ఒలింపిక్ ఏడాది కావడంతో కనీసం 5000కు పైగా డోపింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న ‘నాడా’ ఇప్పుడు ఆ పరీక్షలను బయట జరిపితే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘నాడా’పై సస్పెన్షన్ విధించడం పట్ల కేంద్ర క్రీడా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. దీని వెనక ‘వాడా’ వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ జులనియా అన్నారు. ‘వాడా’ నిర్ణయంపై సీఏఎస్‌లో అప్పీల్ చేస్తామని రాధేశ్యామ్ తెలిపారు. -
పల్లెల్లో అంతర్జాతీయ వైద్యం
► ప్రయోగాత్మకంగా అనంతపురంలో అమలు ► సీఎంను కలిసిన న్యూ మెక్సికో వర్సిటీ బృందం హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రపంచవ్యాప్తంగా వైద్యచికిత్సల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా అందించడానికి ఒక అంతర్జాతీయ బృందం ముందుకొచ్చింది. దీన్ని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఈ బృందానికి సూచించారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని తన కార్యాలయంలో కలిసిన న్యూ మెక్సికో యూనివర్సిటీ వైద్య నిపుణుల బృందంతో సీఎం మాట్లాడారు. ఎకో ఇండియా, కరుణ ట్రస్టు ప్రతినిధులతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామని ఈ బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు జవసత్వాలు కల్పిస్తున్నట్టు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. పేదల వైద్యానికి నిధుల కొరత లేదని, అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఆధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి పల్లెల్లో పనిచేయాలనుకోవడం మంచి పరిణామమని అభినందించారు. మాతా, శిశు మరణాలను నూరు శాతం తగ్గించటానికి అంతర్జాతీయ వైద్య నిపుణులు మన రాష్ట్రంలోని 12,000 మంది నర్సులకు దశలవారీగా శిక్షణ ఇస్తారు. న్యూ మెక్సికో యూనివర్సిటీ, ఎకో, కరుణ ట్రస్టు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనకు వచ్చాయి. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా ముందు కంటి శస్త్ర చికిత్సలు, దంత వైద్యం, మానసిక వైద్యం, ప్రాథమిక ఆరోగ్య విభాగాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ నిపుణులు స్థానిక వైద్యులకు, నర్సులకు శిక్షణనిస్తారు. శస్త్ర చికిత్సల్లో టెలిమెడిసిన్ విధానం ఉపయోగించుకుంటారు. అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును అమలుచేశాక మిగిలిన 12 జిల్లాలకు విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే కర్ణాటకలోని 28 పీహెచ్సీలలో స్పెషలిస్టు హెల్త్ కేర్ అందజేస్తున్న కరుణ ట్రస్టు సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఎకో ప్రాజెక్టు డైరెక్టర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ సంజీవ్ అరోరా, పెర్మియన్ ప్రీమియర్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయరామ్ నాయుడు, ఎకో అమెరికా ప్రోగ్రాం స్పెషలిస్టు స్మిత్, ఎకో చైర్మన్ డాక్టర్ కుముద్ మోహన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఆనంద్, కరుణ ట్రస్టు సంయుక్త కార్యదర్శి వెంకట నారాయణతో పాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉన్నారు. -
భారత్‌లో మైనారిటీల భద్రతపై సంఘర్షణ
►అమెరికా ప్రతినిధుల సభ కమిటీ నివేదిక ► రాజకీయ అవినీతి, చిత్తశుద్ధి లోపం వల్ల మైనారిటీలపై నేరాలు ►బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని వెల్లడి వాషింగ్టన్: లౌకిక దేశంగా, విభిన్న మతాల ప్రజలు ఐక్యంగా ఉండే దేశంగా పేరున్నా... భారతదేశంలో మైనారిటీల రక్షణ, భద్రత కోసం, సరైన న్యాయం కోసం సంఘర్షణ జరుగుతోందని అమెరికా పేర్కొంది. రాజకీయంగా చిత్తశుద్ధి లోపించడం వల్ల.. రాజకీయ అవినీతి వల్ల, ప్రభుత్వ అధికారులే మతపరంగా వివక్ష చూపించడం వల్ల వారిపై నేరాలు జరిగినప్పుడు.. ఏ మాత్రం న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ స్థాయిలో మత స్వేచ్ఛ అంశంపై ఏర్పాటైన అమెరికా ప్రతినిధుల (కాంగ్రెస్) సభా కమిటీ (యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలీజియస్ ఫ్రీడమ్-యూఎస్సీఐఆర్ఎఫ్) ఈ మేరకు గురువారం ఒక వార్షిక నివేదికను విడుదల చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడానికి.. ఈ కమిటీయే ప్రధాన కారణం కావడం గమనార్హం. ► మత స్వేచ్ఛకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విఘాతం కలిగించిన వ్యక్తులను దేశంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (ఐఆర్‌ఎఫ్‌ఏ) ఉపయోగపడుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. ► అయితే దానిని కేవలం ఒకసారి మాత్రమే ప్రయోగించడానికి అవకాశం ఉందని, దీనిని సవరించాలని కమిటీ అమెరికా ప్రభుత్వానికి సూచించింది. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మోడీ తరహాలో మత స్వేచ్ఛకు విఘాతం కలిగించిన వారి జాబితాను అమెరికా హోం, విదేశీ మంత్రిత్వ శాఖలకు అందజేశామని.. దీని ఆధారంగా వీసా నిషేధిత వ్యక్తుల జాబితాను పెంచాలని కోరింది. ► భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మత స్వేచ్ఛ అంశంపైనా దృష్టి పెట్టాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది. మత పరమైన హింస, వివక్షపై సమర్థవంతంగా స్పందించేలా, ఉన్నత స్థాయి ప్రమాణాలు నెలకొల్పేలా పోలీసుశాఖను బలోపేతం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొంది.