రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందిన వ్యక్తికి రూ.వెయ్యి క్యాష్ బ్యాక్ ఇచ్చి సరిపెట్టింది ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్. జాక్‌పాట్ కొట్టానన్న సంబరంలో ఉన్న ఆ వ్యక్తికి.. సాంకేతిక సమస్య కారణంగా ఈ బహుమతులు 200 మంది గెలుపొందారని, దీంతో జాక్‌పాట్ రద్దు చేస్తున్నట్లు చావు కబరు చల్లగా చెప్పింది ఆ కంపెనీ.
ఈ మేరకు అవిరల్ సంగల్ అనే వ్యక్తి ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. క్రెడ్ ఫ్రైడే జాక్‌పాట్ తాను రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందానని, కానీ సాంకేతిక కారణాలతో జాక్‌పాట్‌ను రద్దు చేశామని, కేవలం రూ.1,000 మాత్రం క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఫ్రైడే జాక్‌పాట్‌లో మ్యాక్‌బుక్, ఐపాడ్, ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్, టూమి బ్యాగ్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి.
బహుతులు అందుకోవడానికి ఫారమ్ నింపాలని క్రెడ్ కోరిందని, టీడీఎస్ చెల్లింపు కోసమని తన పాన్ వివరాలు కూడా తీసుకుందని సంగల్ చెప్పుకొచ్చారు. తర్వాత కొన్ని నిమిషాలకు క్రెడ్ ప్రతినిధులు తనకు కాల్ చేసిసాంకేతిక సమస్య కారణంగా జాక్‌పాట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని గుడ్ విల్ కింద రూ.వెయ్యి క్యాష్‌బ్యాక్ ఇస్తామని చెప్పారని వాపోయాడు.
Even though I usually do not fall for the @CRED_club jackpots, but yesterday I just played the friday jackpot without having any hope of getting anything meaningful. But I scored the JACKPOT and it wasn't a small one. It included a Macbook, Ipad, Airpods Max and a TUMI bag worth… pic.twitter.com/16SwhchMYm
— Aviral Sangal (@sangalaviral) September 7, 2024
Comments
Please login to add a commentAdd a comment