
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ అనుబంధ కంపెనీ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎల్‌ఎల్) 70,000 ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈ–వెహికిల్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్న త్రీ వీల్స్ యునైటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ వాహనాలు వచ్చే అయిదేళ్లలో దశలవారీగా వివిధ నగరాల్లో రంగ ప్రవేశం చేస్తాయి. సగటున ఒక్కో త్రిచక్ర వాహన ధర ప్యాసింజర్ వేరియంట్ రూ.3 లక్షలు, కార్గో రకం రూ.3.5 లక్షలు ఉంటుంది. త్రీ వీల్స్ యునైటెడ్ ఒక్కో లాట్‌లో 100 నుంచి 20,000 యూనిట్లు కొనుగోలు చేయనుంది.
ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల డిమాండ్‌ను పెంచడానికి సీఈఎస్‌ఎల్ ద్వారా నిర్వహించనున్న 1,00,000 వాహనాల టెండర్‌కు అనుగుణంగా ఈ ఏర్పాటు జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment