సురేష్ అండ్‌కో... చాలా చిన్న సంస్థ. అందులో కేవలం 10 మంది ఉద్యోగులు. కస్టమర్ల బకాయిలు, ఇన్‌వాయిస్‌లు, పేమెంట్స్ ఇవన్నీ చూడాలి. పైగా బిజినెస్ డెవలప్‌కోసం ఫైనాన్స్ కూడా అవసరం.
రమేష్ టెక్నాలజీస్.. ఇదికూడా చిన్న సంస్థ. ఈజీగా ఓ 30మంది ఉద్యోగులు ఉంటారు. కస్టమర్ల బకాయిలు, ఇన్‌వాయిస్‌లు, పేమెంట్స్ వ్యవహారాల్ని చూసుకునేందుకు ఉద్యోగి కావాలి. కోవిడ్ వల్ల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే అన్నీ తానై నడిపిస్తున్నాడు రమేష్. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే 20 రోజులు ముందునుంచే పనులన్నీ మానుకొని అకౌంట్స్ చెక్ చేసుకుంటున్నాడు. అదే సయమంలో రమేష్ ఓ సాఫ్ట్‌వేర్, లేదంటే కంపెనీ ఉంటే బాగుంటుందని అనుకోని సందర్భంలేదు.
అదిగో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకే పుట్టుకొచ్చిందే ఫిన్‌టెక్ సంస్థ రికార్డెంట్. ఈ స్టార్టప్‌లో మనదేశంతో పాటు ఇతర ఏంజెల్ ఇన్వెస్టర్ల నుండి $400,000 సేకరించింది. ఆ ఫండింగ్‌తో ప్రణాళికలకు అనుగుణంగా, వ్యాపారాలకు ఫైనాన్సింగ్ అందించడం, ఇన్‌వాయిస్లను అందించేలా పనిచేస‍్తుంది. 50పైగా చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పనిచేస్తుంది. కస్టమర్ల నుంచి బకాయిల్ని వసూలు చేయడం, క్రెడిట్ రిస్క్‌ని తగ్గిస్తుంది. 11,000 వ్యాపార సంస్థలకు 50 వేలకుపైగా కస్టమర‍్లకు రూ. 2,500 కోట్లకుపైగా మంజూరు చేసింది. 2021లో ప్లాట్‌ఫారమ్ 220% వృద్ధిని నమోదు చేసింది. వచ్చే ఏడాది నాటికి తన నెట్ వర్క్‌ను విస్తరించే పనిలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment