ఫైనాన్షియల్ ఉత్పత్తుల పంపిణీని సులభతరం చేసే ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ గ్రోమో.. 5 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా భారతదేశంలోని తన విలువైన భాగస్వాములకు రూ.100 కోట్ల చెల్లింపులను చేసినట్టు ప్రకటించింది. తెలంగాణలో, కంపెనీ తన 14800 గ్రోమో భాగస్వాములకు రూ.3.75 కోట్లకు పైగా చెల్లింపులను చేసింది.
గత ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో 1.03 లక్షల మంది భాగస్వాములు గ్రోమోలో చేరారు, వారు ఎంచుకున్న ఉత్పత్తులను గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 1.5 లక్షల మంది కస్టమర్‌లతో కనెక్ట్ అయ్యారు. గత 5 సంవత్సరాలలో క్రెడిట్ కార్డ్‌ల కోసం 43 శాతం, సేవింగ్స్ ఖాతా కోసం 39 శాతం, పర్సనల్ లోన్ కోసం 13 శాతంతో డిమాండ్ పరంగా తెలంగాణాలో ఎక్కువ ఎక్కువగా ఉంది.
ఐదు సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా గ్రోమో సహ వ్యవస్థాపకుడు 'దర్పన్ ఖురానా' మాట్లాడుతూ.. భారతదేశం అంతటా మా భాగస్వాములకు రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేలా చేయడం పట్ల మేము చాలా గర్వపడుతున్నామని, గతేడాది తెలంగాణలోని కీలక రంగాలలో 4 రెట్లు వృద్ధిని గమనించినట్లు, దీంతో 14800 మంది సంపాదన భాగస్వాములను చేరుకున్నామని తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, తెలంగాణ అంతటా విజయవంతంగా మా పరిధిని విస్తరించాము. మా విస్తరణ వ్యూహంలో తెలంగాణలో కీలక అంశంగా.. రాబోయే సంవత్సరంలో మా వర్క్‌ఫోర్స్‌ను పెంచాలని, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయాలని ఆశిస్తున్నట్లు గ్రోమో సీఈఓ & సహ వ్యవస్థాపకుడు 'అంకిత్ ఖండేల్వాల్' తెలిపారు.
గ్రోమోతో అనుబంధం కలిగి ఉండటం ద్వారా దేశంలోని ప్రతి మూలకు మేము సౌకర్యవంతంగా చేరుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా 'పునీత్ భాటియా' (హెడ్-ఏజెన్సీ, SBI జనరల్ ఇన్సూరెన్స్) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment