సాక్షి, ముంబై: ఉద్యోగుల తొలగింపుపై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో 27 వేల మందిని తొలగించడం అనేది చాలా కఠినమై నిర్ణయం.. కానీ తప్పలేదని తెలిపారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నా మని చెప్పారు. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు.
కంపెనీ ఎదుర్కొన్నసవాళ్లను వివరిస్తూ వాటాదారులకు సీఈవో వార్షిక లేఖ రాశారు. ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కంపెనీ వృద్ధికి సహాయపడతాయనే విశ్వాసాన్నివ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించే నిర్ణయం కష్టమైనదే కానీ దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. (టైమ్స్ మాగజైన్ 100: ఈ రంగం నుంచి వీరిద్దరే, ఆ సూపర్‌స్టార్లు ఎవరంటే?)
కంపెనీ సంక్షేమంపై లోతుగా సమీక్షిస్తూ, ఒక్కో బిజినెస్‌ను స్టడీ చేసిన అనంతరం తీసుకున్న తమ నిర్ణయంతో రానున్న రోజుల్లో కంపెనీకి మంచి జరుగుతుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు. అలాగే ఖర్చులను తగ్గించేందుకు అమెజాన్ కంపెనీకి చెందిన ఫిజకల్ స్టోర్స్‌ను మూసి వేశా మన్నారు. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ఎఫర్ట్స్‌ను కూడా మూసివేసినట్లు చెప్పారు.
తొలగించిన ఉద్యోగులకు తెగతెంపుల చెల్లింపు, తాత్కాలిక ఆరోగ్య బీమా ప్రయోజనాలతోపాటు బయట ఉపాధిని కనుగొనడంలో సహాయం అందిస్తుంది. అలాగే, మే నెల నుండి సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేస్తారని కూడా ఆండీ జాస్సీ పేర్కొన్నారు. కాగా అమెజాన్‌లో రెండు దఫాలుగా 27 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment