ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్‌మన్ సాచ్స్‌తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్‌మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి.
ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment