ఐఫోన్ 6 వచ్చేసింది...
క్యూపర్టినో: యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది.
ఇంతకు ముందటి ఐఫోన్‌లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 6.9 ఎంఎం మందం, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ).
అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్‌ప్లే హెచ్‌డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ).