ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి.. | iphone 6 sales from 17th | Sakshi
Sakshi News home page

ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..

Published Tue, Oct 7 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..

ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..

న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్‌లు, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను ఈ నెల 17 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. ఈ కొత్త ఐఫోన్ ల ధరలు రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్‌లో ఉన్నాయి.  ఈ ధరలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేసిన ధరల కంటే తక్కువగా ఉండడం విశేషం. అయితే అమెరికాలో ఐఫోన్ రిటైల్ ధరలతో పోల్చితే ఈ ధరలు 10-17% అధికం. అమెజాన్ వెబ్‌సైట్ ఐఫోన్ 6ను డెలివరీ చార్జీలతో కలిపి 750 డాలర్లు (సుమారురూ.46,000)కు విక్రయిస్తోంది.

 తొలిసారిగా ముందస్తు బుకింగ్స్
 గత నెలలో యాపిల్ కంపెనీ పెద్ద స్క్రీన్ ఉన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, కొత్తగా  యాపిల్ వాచ్, యాపిల్ పే(మొబైల్ వాలెట్)లను ఆవిష్కరించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ల విక్రయలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత డిస్ట్రిబ్యూటర్లుగా రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో, రాశి పెరిఫెరల్స్, రిలయన్స్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో ఐఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ ఇదే తొలిసారి.  వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 7 నుంచే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ మైక్రో పేర్కొంది. యాపిల్ కంపెనీకి ఈ సంస్థ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్.  24 నగరాల్లోని 1,200 అవుట్‌లెట్లతో పాటు, తమ వెబ్‌సైట్ ద్వారా కూడా ముందస్తుగా ఈ ఐఫోన్‌లను బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ తెలిపింది. ఈ రెండు ఫోన్‌లు 2జీ, 3జీ, 4 జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి.

8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 6.9 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6లో 4.7 అంగుళాల స్క్రీన్ ఉండగా,  7.1 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంది.  గత ఏడాది యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను రూ.53,500 ధరకు భారత్‌లో అందించింది. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.30,000 రేంజ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement