iPhone 6 Plus
-
అవును ఆ ఫోన్లలో సమస్య ఉంది: ఆపిల్
న్యూఢిల్లీ: తమ ప్రొడక్ట్.. ఐఫోన్ 6 ప్లస్ మోడల్ ఫోన్లలో కొంత సమస్య ఉన్న మాట నిజమే అని ఆపిల్ కంపెనీ అంగీకరించింది. ఫోన్ డిస్ప్లే కొన్నిసార్లు స్పందించడం లేదని, ఈ సమస్యను సరిచేయడం కోసం ప్రత్యేక రిపేర్ ప్రోగ్రాంను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సర్వీస్ ఉచితం మాత్రం కాదు. టచ్ డిసీజ్ గా పిలువబడుతున్న ఈ సమస్యలో.. కొన్ని సార్లు డిస్ప్లే మినుకుమినుకుమంటూ స్పందించకుండా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫోన్‌పై ఒత్తిడి పడినప్పుడు, ఇతర సందర్భాల్లో ఈ సమస్య వస్తున్నట్లు గుర్తించామని ఆపిల్ వెల్లడించింది. దీని కోసం స్పెషల్ రిపేర్ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా రూ. 9,900 చెల్లించి టచ్ డిసీజ్ ఉన్న ఫోన్లను రిపేర్ చేయించుకోవచ్చని ఆపిల్ వెల్లడించింది. అయితే.. డిస్ప్లే పగలకుండా, వర్కింగ్ కండీషన్లో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ అవకాశం అని తెలిపింది. ఇది కేవలం ఐఫోన్ 6 ప్లస్ మోడల్ కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
భారత్‌లో ఐఫోన్6 అమ్మకాలు షురూ
న్యూఢిల్లీ: యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాలు భారత్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 4.7 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 53,500, 64 జీబీ వెర్షన్ ధర రూ. 62,500, 128 జీబీ ధర రూ. 71,500గా ఉంది. ఇక, 5.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఐఫోన్ 6 ప్లస్‌లో 16 జీబీ వెర్షన్ రేటు రూ. 62,500, 64 జీబీ రేటు రూ. 71,500, 128 జీబీ వెర్షన్ ధర రూ. 80,500గా ఉంది. ఇవి సిల్వర్, గోల్డ్ తదితర రంగుల్లో లభిస్తాయి. పంపిణీదారులు, రిటైలర్ల కథనాల ప్రకారం దేశీయంగా సుమారు 25,000 పైచిలుకు ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు వ చ్చాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ!
భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అమ్మకాలకు రంగం అప్పుడే సిద్ధమైపోయింది. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ దీని ప్రీబుకింగ్ మొదలుపెట్టేసింది. దీపావళి నాటికల్లా భారతదేశంలో ఐఫోన్6 అందుతుందని ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారానే దీన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఇంతకుముందు చైనా యాపిల్‌గా పేరొందిన ఎంఐ3, రెడ్ ఎంఐ లాంటి ఫోన్లను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అమ్మారు. వాటికి కూడా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఐఫోన్ 6కు కూడా ఇలాగే ప్రీబుకింగ్‌ను ఫ్లిప్‌కార్ట్ మొదలుపెట్టింది. ఇందులో కూడా పలు రకాల మోడళ్లను ఆఫర్ చేస్తోంది. 16 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 62,500; 16 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 53,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 71,500; 64 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 71,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6ప్లస్ అయితే 80,500 చొప్పున ధరలు పెట్టారు. వీటన్నింటికీ ఇప్పటికే బుకింగ్ మొదలైపోయింది. బిగ్ బిలియన్ సేల్ పేరుతో 600 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఐఫోన్ అమ్మకాలతో మరెంత ముందుకు వెళ్తుందోనని అంతా చూస్తున్నారు. -
ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లు, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను ఈ నెల 17 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. ఈ కొత్త ఐఫోన్ ల ధరలు రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్లో ఉన్నాయి. ఈ ధరలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేసిన ధరల కంటే తక్కువగా ఉండడం విశేషం. అయితే అమెరికాలో ఐఫోన్ రిటైల్ ధరలతో పోల్చితే ఈ ధరలు 10-17% అధికం. అమెజాన్ వెబ్సైట్ ఐఫోన్ 6ను డెలివరీ చార్జీలతో కలిపి 750 డాలర్లు (సుమారురూ.46,000)కు విక్రయిస్తోంది. తొలిసారిగా ముందస్తు బుకింగ్స్ గత నెలలో యాపిల్ కంపెనీ పెద్ద స్క్రీన్ ఉన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, కొత్తగా యాపిల్ వాచ్, యాపిల్ పే(మొబైల్ వాలెట్)లను ఆవిష్కరించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ల విక్రయలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత డిస్ట్రిబ్యూటర్లుగా రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో, రాశి పెరిఫెరల్స్, రిలయన్స్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో ఐఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ ఇదే తొలిసారి. వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 7 నుంచే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ మైక్రో పేర్కొంది. యాపిల్ కంపెనీకి ఈ సంస్థ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్. 24 నగరాల్లోని 1,200 అవుట్లెట్లతో పాటు, తమ వెబ్సైట్ ద్వారా కూడా ముందస్తుగా ఈ ఐఫోన్లను బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 2జీ, 3జీ, 4 జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 6.9 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6లో 4.7 అంగుళాల స్క్రీన్ ఉండగా, 7.1 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంది. గత ఏడాది యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను రూ.53,500 ధరకు భారత్‌లో అందించింది. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.30,000 రేంజ్లో ఉంది. -
ఐఫోన్ 6 ధర రూ.56,000 రేంజ్లో!
న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6ను రూ.56,000 ధరల రేంజ్లో అందిస్తామంటూ ఈ కామర్స్ సంస్థలు ఊరిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఖచ్చితంగా ఎప్పుడు భారత్ మార్కెట్లోకి విడుదల చేసేదీ, ధర తదితర విషయాలను యాపిల్ కంపెనీ ఇంతవరకూ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, పలు ఈ కామర్స్ కంపెనీలు ఈ నెల రెండో వారం నుంచి రూ.56,000 ధరల రేంజ్లో ఈ ఫోన్‌ను అందిస్తామని అంటున్నాయి. ఈబే సంస్థ రూ.55,954 ధరకే ఐఫోన్ 6ను అక్టోబర్ 8 నుంచి అందిస్తామని తెలిపింది. ఎలాంటి డెలివరీ చార్జీలు తీసుకోబోమని పేర్కొంది. ఐ ఫోన్ 6 ప్లస్‌ను రూ.77,000కు ఆఫర్ చేస్తామని వివరించింది. ఇక షాప్‌క్లూస్‌డాట్‌కామ్ సంస్థ రూ.59,999 ధరకు అక్టోబర్ 8 నుంచి అందిస్తామని పేర్కొంది. డెలివరీ చార్జీ రూ.149 అని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను యాపిల్ కంపెనీ గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది. అక్టోబర్ మధ్య నుంచి గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ భారత్‌లో ఈ ఫోన్లను యాపిల్ విక్రయించనున్నదని ఉహాగానాలున్నాయి. ఐ ఫోన్, ఐఫోన్ 6ల్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర వంటి ఫీచర్లున్నాయి. 2జీ, 3జీ, 4 జీనెట్వర్క్లను ఇవి సపోర్ట్ చేస్తాయి. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షన్లలలో ఇవి లభ్యమవుతాయి. -
వంగిపోతున్న యాపిల్ ఐఫోన్ 6
న్యూయార్క్ : మార్కెట్లో విడుదలైన వారంలోనే దుమ్మురేపిన యాపిల్ ఐఫోన్ 6 సమస్యలు ఎదుర్కొంటోంది. ఫోన్ వంగిపోతుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. ఇప్పటి వరకూ వినియోగదారుల నుంచి తొమ్మిది ఫిర్యాదులను అందుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ ఫోన్ వివాదంపై యాపిల్ సంస్థ స్పందించింది. ఐఫోన్ 6, 6 ప్లస్ లను స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియంతో అత్యంత నాణ్యతతో డిజైన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్యాంటు పలుచగానూ, టైట్ గానూ ఉండటం వల్ల వెనక్కి పెట్టినప్పుడు ఐఫోన్ 6 ప్లస్ వంగిపోయి ఉండవచ్చనన్న మొబైల్ నిపుణుల వాదనతో కంపెనీ ఏకీభవించింది. ఎక్కువ సేపు ఐఫోన్‌ను ప్యాంటు వెనక జేబులో పెట్టినప్పుడు ఎలర్ట్ చేస్తుందని దాన్ని పట్టించుకోన్నప్పుడు సమస్యలు వస్తాయని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ ప్రతినిధి కోరారు. ప్రస్తుత వెర్షన్‌ను తర్వలోనే సరిచేస్తామని పేర్కొన్నారు. -
ఐఫోన్6 దుమ్మురేపింది!
న్యూయార్క్: మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని కంపెనీలు తెలిపారు. తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని బిజినెస్ అనలిస్ట్ జీనె మునస్టర్ తెలిపారు. గత సంవత్సరం విడుదలైన తొలి వారాంతంలోనే ఐఫోన్ 5ఎస్, 5సీ మోడల్స్ చైనాతోపాటు 11 దేశాల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ ప్రకంపనలు!
మొబైల్ ఫోన్ ప్రపంచంలో ఆపిల్ ఐఫోన్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మొబైల్ రంగంలో అంతార్జాతీయంగా, ముఖ్యంగా చైనా నుంచి ఎదురువుతున్న పోటీని తట్టుకోవడానికి ఆపిల్ సంస్థ సెప్టెంబర్ 9 తేదీన 'ఐఫోన్6', 'ఐఫోన్ 6 ప్లస్' అనే రెండు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఐఫోన్లను సొంతం చేసుకోవడానికి మొబైల్ వినియోగదారుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే ఒకేరోజు విడుదల అయిన ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో తేడాలు ఏంటనే ప్రశ్న వినియోగదారుల్లో ఎదురవుతోంది. కలర్, సైజు: మార్కెట్ లోకి విడుదలైన ఐఫోన్ గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ స్క్రీన్ డిస్ ప్లే 4.7 ఇంచులు, 6.9 ఎంఎం మందం ఐఫోన్6 ప్లస్ స్కీన్ డిస్ ప్లే 5.5 ఇంచులు, 7.1ఎంఎం మందం ధర & మెమరీ: రెండేళ్ల కాంట్రాక్టు తో.. ఐఫోన్ 6 - 16 జీబీ (199 డాలర్లు), 64 జీబీ (299 డాలర్లు), 128 జీబీ (399 డాలర్లు) ఐఫోన్ 6 ప్లస్ 16 జీబీ (299 డాలర్లు), 64 జీబీ (399 డాలర్లు), 128 జీబీ (499 డాలర్లు) బ్యాటరీ: ఆపిల్ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఐఫోన్6 3జీ సేవల్లో 14 గంటల టాక్ టైమ్, ఐఫోన్ 6 ప్లస్ 24 గంటల టాక్ టైమ్ తో బ్యాటరీ సేవలందిస్తుందని తెలిపారు. అలాగే 11 గంటల వీడియో ప్లేబ్యాక్, ఐఫోన్ 6 ప్లస్ 14 గంటల వీడియో ప్లే బ్యాక్ సామర్ధ్యం ఉంటుందని తెలిపారు. ఐఫోన్ 5ఎస్ తో పోల్చితే కొత్త మోడల్ లో ఆడియో, వీడియో, వైఫే బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని 10 శాతం, 3జీ బ్రౌజింగ్ ను 20 శాతం పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. ఇతర ఆప్సన్స్: 64 బిట్ బిట్ తో మైరుగైన సీపీయూ, జీపీయూ ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. డిస్ ప్లే: ఐఫోన్6 ప్లస్: 1920x1080 మెగా పిక్సల్స్ రెజల్యూషన్, ఐఫోన్ 6: 1704x960 మెగా పిక్సల్స్ రెజల్యూషన్ ఇలాంటి ప్రత్యేకతలున్న ఐఫోన్ మోడళ్లను భారతదేశంలోని వినియోగదారులు సొంతం చేసుకోవాలంటే అక్టోబర్ 17 తేదీ వరకు ఆగాల్సిందే. యూఎస్, కెనడా, యూకే, ఇతర ఆరు దేశాల్లో మాత్రం సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 12 తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని ఆపిల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఐఫోన్ 6 వచ్చేసింది...
క్యూపర్టినో: యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది. ఇంతకు ముందటి ఐఫోన్లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్ప్లే, 6.9 ఎంఎం మందం, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ). అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్ప్లే హెచ్డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ). ఇగ్లీష్ కథనం కోసం