ఐఫోన్6 దుమ్మురేపింది!
ఐఫోన్6 దుమ్మురేపింది!
Published Tue, Sep 23 2014 2:38 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
న్యూయార్క్: మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని కంపెనీలు తెలిపారు.
తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని బిజినెస్ అనలిస్ట్ జీనె మునస్టర్ తెలిపారు. గత సంవత్సరం విడుదలైన తొలి వారాంతంలోనే ఐఫోన్ 5ఎస్, 5సీ మోడల్స్ చైనాతోపాటు 11 దేశాల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement
Advertisement