Cupertino
-
అద్భుత ఫీచర్లతో ఐఫోన్ 16 !
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్‌ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్లుండే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు. అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది. కొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. 16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్‌వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది. – వాషింగ్టన్ -
యాపిల్ హెడ్ ఆఫీసులో ఉద్యోగి మృతి
కాలిఫోర్నియా: అసలే ఈ ఏడాది నికర లాభాల్లో 13 శాతం నష్టాలు చవిచూసి బాధల్లో ఉన్న యాపిల్ కంపెనీకి మరో షాక్ తగిలింది. క్యూపర్టినో నగరంలో గల యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లోని 1 ఇన్ఫినిటీ క్యాంపస్ వద్ద బుధవారం ఉదయం ఒక ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. నగరంలోని యాపిల్ ఆఫీస్ నుంచి ఉద్యోగి మరణించినట్లు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. హుటాహుటిన 1ఇన్ఫినిటీలూప్కు చేరుకున్న పోలీసులు ఉద్యోగి శవాన్ని పరిశీలించారు. ఉద్యోగిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాలను విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని క్యూపర్టినో నగర అధికారి షెరీఫ్ సెక్యూరిటీ డిప్యూటీ యురీనా తెలిపారు. ఓ వెబ్సైట్లో లభించిన ఆడియో టేపుల ప్రకారం అదే ఆఫీసులో పనిచేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వ్యక్తి మరణానికి రెండు నిమిషాల ముందు ఆమె తలపై ఎవరో తుపాకీ కాల్చినట్లు చెబుతున్నారు. కానీ, అతని మరణానికి ఆమె ఏ విధంగా కారణమనే విషయం మాత్రం ఆ టేపులో వెల్లడించలేదు. ఈ ఆడియో వివరాలపై అధికారులు స్పందించలేదు. ఈ విషయం మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరికి అపాయం లేదని అధికారులు చెప్పారు. ఘటనపై కంపెనీ ఇచ్చిన వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే, ఉద్యోగి మృతిపై యాపిల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ఐఫోన్ 6 వచ్చేసింది...
క్యూపర్టినో: యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది. ఇంతకు ముందటి ఐఫోన్లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్ప్లే, 6.9 ఎంఎం మందం, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ). అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్ప్లే హెచ్డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ). ఇగ్లీష్ కథనం కోసం