భారత్కు యాపిల్ సీఈవో! | Apple CEO Tim Cook may visit India this week to meet PM Narendra Modi: Sources | Sakshi
Sakshi News home page

భారత్కు యాపిల్ సీఈవో!

Published Mon, May 16 2016 6:26 PM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

Apple CEO Tim Cook may visit India this week to meet PM Narendra Modi: Sources

ముంబయి/న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ భారత్లో అడుగుపెట్టనున్నారు. ఈ వారంలో ఆయన భారత్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవనున్నట్లు కీలక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఐఫోన్ అమ్మకాలు అమాంతంగా తగ్గుముఖం పట్టడంతో ఐఫోన్ మార్కెట్కు అనుకూలమైన భారత్లో పర్యటించడం ద్వారా సంస్థకు కొంత మేలు జరగవచ్చనే అభిప్రాయంతో ఈ పర్యటన ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎలాగైనా యాపిల్ సంస్థను తిరిగి పురోగతి బాట పట్టించే ఉద్దేశంతో ఉన్న కుక్ భారత్ సందర్శనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే చైనాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం భారత్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పర్యటన వివరాలు కావాలనే సదరు కంపెనీ బహిర్గతం చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్లో తొలి ఔట్ లెట్ సెంటర్ను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement