వాషింగ్టన్: టిమ్‌కుక్. నేటి కాలంలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘ఆపిల్’ సీఈఓగా ఆయన సుపరిచితులు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పనితో ఆయన తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో టిమ్‌కుక్, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే, ఆపిల్ సీఈఓ పేరును ట్రంప్ పలుమార్లు తప్పుగా ఉచ్చరించారు. టిమ్ కుక్ బదులు.. ‘టిమ్ ఆపిల్’ అని పలికాడు. దీంతో టిమ్ అవాక్కయ్యారు.
అయితే, తన ఉన్నతిని పేర్కొంటూ ట్రంప్ అలా చమత్కరించాడని గ్రహించిన టిమ్ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. సమావేశం అనంతరం టిమ్ తన ట్విటర్ ప్రొఫైల్‌లో మార్పులు చేశారు ప్రొఫైల్ నేమ్.. ‘టిమ్‌తో పాటు ఉన్న ఆపిల్ సింబల్’ను జోడించాడు. టిమ్ చర్యపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వచ్చాయి. ట్రంప్ కూతురు ఇవాంకా లాఫింగ్ రియాక్షన్ ఇచ్చారు. కాగా, పేర్లను తప్పుగా ఉచ్చరించడం అమెరికా అధ్యక్షుడికి ఇది కొత్త కాదు. గతంలో లాక్‌హీడ్ మార్టీన్ సీఈఓ మారీలీన్ పేరును.. మారీలీన్ లాక్‌హీడ్‌గా పేర్కొన్నారు.
— Ivanka Trump (@IvankaTrump) 7 March 2019
Comments
Please login to add a commentAdd a comment